బాలయ్యతో 'బొబ్బిలి పులి'?

దాంతో ఇప్పుడూ రాష్ట్రంలో ఆ పరిస్ధితులు ఉన్నాయనే ఈ తరహా చిత్రం రావల్సిన అవసరం ఉందని దాసరి గ్రహించే ఈ ప్రయత్నానికి పూనుకుంటున్నారని సమాచారం. అయితే కథ మాత్రం ప్రస్తుతం పరిస్ధితులను స్పృశిస్తూ సాగుతుందని,అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండి,బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లుగా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ చిత్రం అప్పటి ఎన్టీఆర్ ని రాజకీయంగా ప్రమోట్ చేసినట్లుగా ఇప్పుడూ బాలయ్యనూ ఆ కోణం నుంచి ఆవిష్కరించనున్నాదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం దాసరి మేస్త్రి షూటింగ్ లో బిజీగా ఉంటే బాలకృష్ణ శ్రీదేవీ మూవీస్ వారి చిత్రం,కళ్యాణ్ రామ్ చిత్రాన్ని ఒప్పుకుని ఉన్నారు. అంటే ఈ రెండు చిత్రాల అనంతరం దాసరి చిత్రం ఉండే అవకాశం ఉందని దాసరి ఫిల్మ్ ఇనిస్ట్యూట్ పతాకంపై దీన్ని నిర్మించనున్నారని సమాచారం. ఏదిఏమైనా మరో సారి బొబ్బిలి పులి నందమూరి వంశం నుండే రావటం,దానికి దాసరే దర్శకత్వం వహించటం అభిమానులను ఆనంద పరిచే విషయం.


Click it and Unblock the Notifications











