దర్శకరత్న దాసరి నారాయణ రావు పంచ్ ఎక్కడా....!?
'యంగ్ ఇండియా" సినిమా టైమ్ లో చిన్న సినిమాని బతికించేస్తానంటూ బీభత్సమైన డైలాగులు పేల్చిన దర్శక నిర్మాత దాసరి నారాయణరావు, ప్రస్తుతం ఆ విషయాన్నే ఎక్కడా ప్రస్తావించడంలేదు. దాసరి వద్ద ఈ విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తున్నా, ఆయన సమాధానాన్ని దాటవేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం బాలకృష్ణతో భారీ రేంజ్ లో 'పరమవీరచక్ర" సినిమాని తెరకెక్కిస్తోన్న దాసరి, ఈ టైమ్ లో చిన్న సినిమా గురించి మాట్లాడితే అందరిముందూ 'ఫూల్" అయిపోతాననే ఉద్దేశ్యంతోనే ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయిన వ్యయాన్ని తగ్గించేందుకు కాస్ట్ కటింగ్ అంశాన్ని తెరకెక్కించిన నిర్మాతల మండలి కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకున్నట్లే కన్పిస్తోంది.
అప్పట్లో ఓ చిన్న సినిమా నిర్మాత ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో మొదలైన వ్యవహారం, పైరసీ అనీ, కాస్ట్ కటింట్ అనీ, చిన్న సినిమా బతకడంలేదనీ ఇలా రకరకాల మలుపులు తిరిగి, అడ్రస్ లేకుండా మాయైపోయింది. ఇకేముంది. హీరోలు, హీరోయిన్స్ స్టార్ కమెడియన్ల రెమ్యునరేషన్లు సగానికి సగం తగ్గిపోతాయని అనుకున్నవారంతా, ఇప్పుడేమో డీలా పడిపోయారు. ఆ మాటకొస్తే, సినీ పరిశ్రమలో ఈ తరహా హడావిడి మామూలే..హడావిడి చేయడం ఆ తర్వాత చల్లారిపోవడం తెలీని వారికి సినీ పరిశ్రమ ట్రెండ్ మారిపోతోందని అన్పించడం తప్ప, అసలు మేటర్ మాత్రం ఇంచి కూడా ముందుకు కదలదు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











