దాసరితో ఇలియానా క్లాష్?
హాట్ స్టార్ ఇలియానాకీ ప్రముఖ దర్శకుడు దాసరికీ ఇగో క్లాష్ ఏర్పడింది. తాజాగా దాసరి..శిష్యుడు మోహన్ బాబు ఆహ్వానంపై ఆయన కుమారుడు హీరోగా రూపొందుతున్న సలీం చిత్రం షూటింగ్ కి వెళ్ళటం జరిగింది. ఆయనతో పాటు మూవీ మొఘల్ రామానాయుడు కూడా ఉన్నారు. ఇద్దరూ వెళ్ళి మోహన్ బాబుని పలకరించి యూనిట్ తో పిచ్చాపాటి మాట్లాడుతూన్నారు. ఈ లోగా షాట్ ఫినిష్ చేసుకున్న ఇలియానా అక్కడకి వచ్చి దాసరిని చూసి హాయ్ అని పలకరించింది. అందరూ దాసరిని గురూ గారు అని సంభోదిస్తూంటారు. అలాగే కనపడగానే కొందరైతే కాళ్ళకు నమస్కారాలు చేస్తారు.మరికొందరు నమస్తే చెబుతారు వినయంగా. ఇన్నేళ్ళగా సాగుతున్న ఈ సంప్రదాయంకి ఇలియానా ఈ పలకరింపుతో గండికొట్టినట్లయింది.
దాంతో దాసరి వెంటనే రెస్పాండ్ అవుతూ ఇతరులను గౌరవంగా పలకరించటం నేర్చుకోమని మందలింపుగా అన్నారు. దానికామె తాను ఇతరులను పలకరించే పద్దతి ఇదేనని నొక్కి చెప్పటం జరిగింది. దాసరి ఏదైనా ఒప్పుకుంటారు గానీ క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు చూపకపోతే సహించరన్న సంగతి తెలిసిందే. దాంతో మోహన్ బాబు వచ్చి సర్ది చెప్పినా బాధతో ఆయన అక్కడ నుంచి వెళ్ళినట్లు తెలుస్తోంది. దాంతో ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది. ముంబయి నుంచి వచ్చే వారికి ఇక్కడ ప్రముఖుల గురించి తెలియదని, సీనియర్స్ గొప్పతనం తెలియకపోవటంతో ఈ రకమైన చిక్కులు వస్తున్నాయని అంటున్నారు. ముంబయి భామలు తెలుగు పరిశ్రమను కేవలం డబ్బులు సంపాదించిపెట్టే వ్యాపారంగానే చూస్తున్నారని వాపోతున్నారు.


Click it and Unblock the Notifications











