మోక్షజ్ఞ లాంచింగ్‌కి డేట్ ఫిక్స్, ఆ రోజే సెట్స్‌పైకి.. తిరుగులేని ముహూర్తం పెట్టించిన బాలయ్య !!
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైంది. తన పుట్టినరోజు నాడు క్యూట్ లుక్స్‌తో ఉన్న మోక్షజ్ఞ ఫోటోలను రిలీజ్ చేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. టాలీవుడ్ యువ దర్శకుడు , హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా బాలయ్య కుమారుడి లాంచింగ్ జరుగుతోంది. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
ఎన్నో అవాంతరాలను దాటుకుని లాంగ్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు . సింబా ఈజ్ కమింగ్ అంటూ ఆయన లుక్‌ను రివీల్ చేశారు. ఇదే సినిమాతో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ మూవీ వస్తోంది. ఈ సినిమాను ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరితో కలిసి తేజస్విని నిర్మిస్తున్నారు.

మోక్షజ్ఞ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మోక్షజ్ఞను పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నానని, ఇందుకు బాలయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్సన్ ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అధికారిక ప్రకటన రావడంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసి తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పడం చర్చనీయాంశమైంది.
నందమూరి బాలకృష్ణకు , జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఎన్టీఆర్ స్పందన ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది. మోక్షజ్ఞ కనుక సరిగా క్లిక్ అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు ఎఫెక్ట్ పడుతుందా అంటూ ఇప్పుడే డిస్కషన్ జరుగుతోంది. అభిమానుల నుంచి ఎన్టీఆర్, మోక్షజ్ఞకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేవి ఆసక్తికరంగా మారాయి. హనుమాన్‌తో ఊపులో ఉన్న ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కావడంతో మోక్షజ్ఞ మూవీపై భారీ అంచనాలున్నాయి.

అయితే మోక్షజ్ఞ సరసన హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారు అనేది కూడా చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నుంచి ఓ కొత్త హీరోయిన్‌ని దింపుతారని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. అంతాబాగానే ఉంది కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతకాలు, జ్యోతిష్యాన్ని బలంగా నమ్మే బాలయ్య.. తన వారసుడి భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతో బలమైన ముహూర్తం పెట్టించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదే దసరా. విజయదశమి నాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని బాలయ్య బలంగా నమ్ముతారు. అందుకే ఆరోజే మోక్షజ్ఞ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని అంటున్నారు. ప్రస్తుతం సత్యానంద్ వద్ద యాక్టింగ్‌లో బిజీగా ఉంటూనే.. లుక్, ట్రాన్స్‌ఫర్మేషన్‌పై మోక్షజ్ఞ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బాలయ్య వారసుడి సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











