»   »  నిర్మాతతో డేటింగ్ చేస్తోన్న హీరోయిన్?

నిర్మాతతో డేటింగ్ చేస్తోన్న హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో', నాని సరసన ‘పైసా' చిత్రాల్లో నటించడంతో పాటు త్వరలో విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి' సినిమాలో అనామిక దేవి పాత్రో నటిస్తోంది హీరోయిన్ కేథరిన్. తమిళం, తెలుగు, మళయాలం చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్ మీద తమిళ మీడియాలో కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో కేథరిన్ డేటింగ్ చేస్తున్నట్లు తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. గత కొంత కాలంగా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారని తెలుస్తోంది.

dating rumors on Catherine Tresa

ఇటీవల కేథరిన్, సదరు నిర్మాత కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లి వచ్చారని, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు లీకైనట్లు సమాచారం. అయితే ఇదే విషయం ఆమెను అడిగితే తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, సినిమాలపైనే పూర్తి దృష్టి సారించినట్లు చెబుతోంది.

హీరోయిన్ కేథరిన్‌కు తెలుగు సినీ పరిశ్రమ అంతగా కలిసి రాలేదు. అందుకే తన ఫోకస్ అంతా తమిళ సినీ పరిశ్రమ మీదనే పెట్టింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అక్కడి స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకుల దృష్టిలో పడేందుకు, అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

English summary
Catherine Tresa is rumored of dating a star producer in Kollywood. The producer whom she is dating isn’t revealed. The Tamil media is highlighting the rumors of her dating a star producer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu