రవితేజ, నితిన్, సాయి ధరమ్ తేజ్ క్లాష్.. చివరకు ఏం జరిగేనో!

మాస్ మహారాజ్ రవితేజ, యంగ్ హీరో నితిన్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఈ ముగ్గురికీ హిట్ అనేది కీలకం. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్న ఈ హీరోలు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టేసి కెరీర్‌లో మరో మలుపు తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే అనుకోకుండా సరిగ్గా ఈ ముగ్గురి మధ్యే క్లాష్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

యంగ్ హీరో నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందుతున్న భీష్మ, మాస్ మహారాజ్ రవితేజ- వీఐ ఆనంద్ కాంబినేషన్ లో రాబోతున్న డిస్కో రాజా, అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతీరోజు పండుగే సినిమాల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటిని డిసెంబర్ నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు. పైగా అందరూ డిసెంబర్ 20 వ తేదీ వైపే కన్నేసి ఉంచారని తెలుస్తోంది.

December Clash On tollywood industry

ఎలాగూ ఈ సారి సంక్రాంతి బరిలో బాలకృష్ణ, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు రంగంలోకి దిగుతున్నారు. సో సంక్రాంతి సీజన్ కంటే ముందే డిసెంబర్ చివర్లోనే తమ సినిమా రిలీజ్ చేసి కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట ఈ మూడు సినిమాల నిర్మాతలు. ఇదే జరిగితే రవితేజ, నితిన్, సాయి ధరమ్ తేజ్ మధ్య గట్టి పోటీ తప్పదు. చూడాలి మరి ఈ ముగ్గురిలో ఎవరైనా తప్పుకుంటారా? లేక అందరూ బరిలో నిలుస్తారా? అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X