టాలీవుడ్ కత్రినాకైఫ్ తో మహేష్ బాబు చేయనున్నాడా!?
మహేష్‌బాబు, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో ఒక టాలీవుడ్ కత్రినాకైఫ్ గా పేరు తెచ్చుకుంటున్న దీక్షాసేఠ్‌ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ సమాచారం.వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ ఆ తర్వాత వరసగా వాంటెడ్,మిరపకాయ చిత్రాలు చేసుకుంటూ వెళ్తోంది.గ్లామర్ కి ప్రాధాన్యత నిచ్చే పరిశ్రమ ఆమెకు మంచి ఆఫర్స్ అందిస్తోంది.ఇక మహేష్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ కోసం చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.అప్పట్లో మిస్టర్ ఫెరఫెక్ట్ టైటిల్ మహేష్ కోసం అనుకున్నదే.అతిధి తర్వాత వీరి కాంబినేషన్ రాలేదు.ప్రస్తుతం మహేష్ దూకుడు సినిమా బిజీలో ఉన్నాడు.
అలాగే సురేంద్రరెడ్డి ..ఎన్టీఆర్ తో చేస్తున్న ఊసరవెల్లి హడావిడిలో ఉన్నాడు.ఈ చిత్రాల అనంతరం వీరిద్దరి కాంబినేషన్ మొదలవ్వవచ్చు.సురేంద్రెడ్డి నెక్ట్స్ చిత్రం మా్త్రం మహేష్ తోనే అని చెప్తున్నారు.అయితే ఈ లోగా మహేష్ మాత్రం కూల్ గా సుకుమార్,క్రిష్ కథలు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.దీక్షాసేధ్ మాత్రం గుణశేఖర్ దర్సకత్వంలో వైవియస్ చౌదరి నిర్మించనున్న నిప్పు చిత్రంలో హీరోయిన్ గా బుక్ అయింది.అలాగే లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న రెబల్ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











