»   » రవితేజను కాదనలేకే ప్రభాస్..ఆమెను

రవితేజను కాదనలేకే ప్రభాస్..ఆమెను

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అల్లు అర్జున్ .వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్ కి ఆ తర్వాత మిరపకాయ, వాంటెండ్ చిత్రాలు చేసింది కానీ కెరీర్ లో పెద్ద స్పీడు రాలేదు. తాజాగా ఆమెకు ప్రభాస్ సరసన ఆఫర్ వచ్చి ఖుషీ చేసింది. అయితే ఆమెకు ఆ ఆఫర్ స్టైయిట్ గా రాలేదని తెలుస్తోంది. రవితేజ రికమెండేషన్ తో ఆమెను ఈ ఆఫర్ వరించిందని చెప్తున్నారు. రవితేజ కలగచేసుకుని ప్రభాస్ కు ఫోన్ చేసి ఆమెకు ఆఫర్ ఇప్పించాడని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఇక లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'రెబల్‌'. పూర్తి స్దాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదడుతూరాబాద్ లో జరుగనుంది. ఈ చిత్రం స్టోరీ గురించి లారెన్స్ మాట్లాడుతూ... చరిత్రలో విప్లవాలు, గొప్ప గొప్ప పోరాటాలూ... ఎలా జరిగాయో ఒక్కసారి తిరగేయండి. మొదట ఒక్కరే మొదలెట్టారు. ఆ తరవాత జనం... అనుసరించారు. పదిమందికి మంచి చేయడానికి వ్యవస్థ మొత్తం కదిలిరావలసిన అవసరం లేదు. ఒక్కడిలో ఆలోచన మొలకెత్తితే చాలు.. అలాంటి ఆలోచన మా హీరోకి వచ్చింది. అదేంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు లారెన్స్‌.

  అలాగే ''ప్రభాస్‌ అంటే దమ్మున్న పోరాట దృశ్యాలే గుర్తొస్తాయి. 'ఛత్రపతి' తరవాత ప్రభాస్‌ అలాంటి సినిమా చేయలేదు. మళ్లీ 'రెబల్‌'లో పూర్తిస్థాయి యాక్షన్‌ హీరోగా కనిపిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన అభిమానులకు ఈ చిత్రం విందు భోజనం లాంటిదే'' అన్నారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జె.భగవాన్‌, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 5 నుంచి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.మిస్టర్ పెర్ఫెక్ట్ లానే ఇందులో కూడా తన లుక్ కొత్తగా ఉంటుందని హీరో ప్రభాస్ చెప్పాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే స్టైలిష్‌గా, మాస్‌గా వుంటుందీ చిత్రం. ప్రభాస్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్నిఅనుకున్న ప్రకారం షెడ్యూల్స్ పూర్తి చేయగలిగితే 'రెబల్" డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామంటున్నారు దర్శక, నిర్మాతలు... సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌.

  English summary
  "Prabhas and Tamanna are acting together for the first time and Deeksha Seth plays another role. We are beginning our third schedule of shoot from September 15th and goes on till completion of the movie, " producers J Bhagavan and J Pullarao said in a press statement.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more