»   » రవితేజ సరసన మిస్ ఇండియా దీక్షా సేధ్?

రవితేజ సరసన మిస్ ఇండియా దీక్షా సేధ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'వేదం' చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేస్తున్న దీక్షా సేధ్ తాజాగా రవితేజ సరసన ఎంపిక అయినట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం కోసమే ఈ ఎంపిక జరిగిందని చెప్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి 'రొమాంటిక్ రుషి' అనే టైటిల్ అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక దీక్షా సేధ్ మిస్ ఇండియా-2009(ఫాంటలూమ్స్ ఫెమీనాప్రెష్ పేస్)గా ఎంపికైంది. వేదం చిత్రంలో ఆమె ఓ డబ్బున్న అమ్మాయిగా చేస్తోంది. మాస్ ఏరియా కుర్రాడైన అల్లు అర్జున్ ఆమె వెనక పడుతూ తనూ ఓ మల్టి మిలియనీర్ కొడుకుని అని బిల్డప్ ఇస్తూంటాడు. ఫన్నీగా సాగే ఈ ఎపిసోడ్స్ వైజాగ్ లో షూటింగ్ చేసారు. పదిహేను నిముషాలు పాటు సాగే ఈ పాత్రలో ఆమె సినిమాకు హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇక రవితేజ సరసన ఎంపికైన ఈ కొత్త చిత్రంలోనూ ఆమె చిలిపితనంతో కూడిన పాత్రను చేయనుందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఆమెకు వరస ఆఫర్స్ రావటంతో ఇక ఈ రెండూ రిలీజయ్యాక ఆమె టాలీవుడ్ ని ఏలే స్టార్ అవుతుందని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu