»   » జానియర్ మాల్యాతో దీపికా పడుకొనే డేటింగ్

జానియర్ మాల్యాతో దీపికా పడుకొనే డేటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రణబీర్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతూ వస్తున్న బాలీవుడ్ అందాల తార దీపికా పడుకొనే లిక్కర్ రారాజు విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్ జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైతో పాటు ఐటీ హబ్ బెంగుళూరులో ఈ జంట చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోందట. ఇటీవల ముంబైలో జరిగిన అమీర్ ఖాన్‌ కొత్త చిత్రం 'పీప్లీ లైవ్' సినిమా స్పెషల్ ప్రదర్శనకు ఈ జంట హాజరై కనువిందు చేసింది. వీరిద్దరు ప్రీమియర్ షో ప్రదర్శనకు ముందు షో తర్వాత పత్రికా విలేకరులకు ఫోజులు ఇచ్చారు.

భారత్‌లో జరిగిన ఐపీఎల్-3 సీజన్ పోటీల సమయంలో ఈ జంట దగ్గరైన విషయం తెల్సిందే. విజయ్ మాల్యాకు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు దీపికా పడుకొనే బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. దీంతో జూనియర్ విజయ్ మాల్యాతో పడుకొనేల మధ్య స్నేహం చిగురించి అది ప్రేమకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ సాన్నిహిత్యమే వీరిమధ్య డేటింగ్‌కు దారి తీసినట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu