twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్-సుకుమార్ చిత్రంలో దీపికా పడుకొనె?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రం నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆమె స్థానంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పడుకొనెను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీపిక కూడా మహేష్ బాబుతో చేయడానికి ఇంట్రస్టు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    సినిమా ప్రారంభంలో ఈచిత్రానికి తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ డేట్స్ కుదరక పోవడంతో తమన్నా తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసినప్పటికీ ఆమె కూడా డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో సైడ్ అయి పోయింది. ఈ నేపథ్యంలో మహేష్ సరసన ఫేమస్ హీరోయిన్ కోసం వెతుకుతున్న దర్శక నిర్మాతలకు దీపిక పడుకొనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

    ఇందులో మహేష్‌ బాబు అధ్యాపకుడి పాత్రను పోషిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆయన రాక్‌స్టార్‌గా కనిపించబోతున్నారని తెలిసింది. ఈ చిత్ర తరువాత షెడ్యూల్ అక్టోబర్ 10 నుండి గోవాలో మొదలు కానుంది.

    ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌ బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

    English summary
    Super Star Mahesh Babu is under ultimate pressure as heroines are walking out of his new film with Sukumar. Milky Beauty Tamanna, who was the first choice opted out citing date issues and freshly Kajal Agarwal also walked out of movie mentioning the same reason. Latest news is, makers of this film in talks with Bollywood actress Deepika Padukone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X