యువరాజ్ సింగ్ మాటలకి అప్ సెట్ అయిన బాలీవుడ్ సెక్సీ సుందరి..!
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఇప్పుడు చాలా హర్ట్ అయింది. సిద్ధార్థ్ మాల్యాకు, తనకు మధ్య ప్రేమాయణం సాగుతోందని రాసినందుకు కాదు. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాటలకు మీడియా పెడార్ధాలు తీస్తున్నందుకు. మొన్న ఆస్ట్రేలియాపై జరిగిన క్వార్టాల్ ఫైనల్ లో ఇండియా గెలిచినప్పుడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ యువరాజ్ చెప్పిన మాటలకు, తనను లింక్ చేసినందుకు అప్ సెట్ అయింది.
'నేనింతిలా ఆడడం వెనుక ఓ వ్యక్తి ఇన్స్ పిరేషన్ వుంది. నేను ఒత్తిడిలో వున్నప్పుడు అ వ్యకి నుంచి స్పూర్తి పొందుతాను. ఆ వ్యక్తి ఎవరనేది ఇండియా ఫైనల్ కి వచ్చాక చెబుతాను' అంటూ యువరాజ్ చెప్పడంతో.... బాలీవుడ్ మీడియా..'ఇంకెవరు.. దీపికానే' అంటూ తెగ రాసేసింది. ఇది చదివే దీపిక ఇప్పుడు చాలా ఆగ్రహంగా వుంది. 'యువరాజ్ నాకు మంచి స్నేహితుడే కానీ, ఇన్స్ పిరేషన్ ఇచ్చేంత వ్యక్తిని కాను నేను. అయినా అతనితో మాట్లాడి చాలా రోజులైంది. ఇవేమీ తెలుసుకోకుండా అలా రాయడం బాగోలేదు" అంటూ దీపికా తెగ ఫీలైపోతోంది. అందుకే, ఆ పేరు కాస్తా యువీ త్వరగా చెప్పేస్తే పోలా?


Click it and Unblock the Notifications











