»   » షాకింగ్... చిరు 150లో హాలీవుడ్ రేంజి హీరోయిన్?

షాకింగ్... చిరు 150లో హాలీవుడ్ రేంజి హీరోయిన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ అఫీషియల్ గా ఖరారు కాలేదు. ఇప్పటి వరకు తమన్నా, నయనతార, అనుష్క పేర్లు వినిపించాయి. తాజాగా టాలీవుడ్ ఊహకు కూడా అందని ఓ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఆవిడ మరెవరో కాదు... ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతున్న నెం.1 బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్.

ఇప్పటి వరకు దీపిక పదుకోన్ సౌతిండియాలో ఏ హీరోతోనూ నటించలేదు. ఆ మధ్య రజనీకాంత్ కొచ్చాడయన్ లో ఆమె యానిమేషన్ రూపం మాత్రం వాడుకున్నారు. మరి చిరంజీవి సినిమాలో చేయడానికి ఆమె ఒప్పుకుందో? లేదో? తెలియదు కానీ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అఫీషియల్ గా సమాచారం వస్తే తప్ప దీన్ని నమ్మలేం.

Deepika Padukone to be Chiru's female lead in 150th film?

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ తన 150వ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2007లో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఇప్పుడు మళ్లీ తొమ్మిదేళ్లకు చిరు చేయబోతున్న సినిమాకి అన్నీ కుదిరాయి. ఆయన 150 సినిమా 'కత్తిలాంటోడు' మూవీ షూటింగ్ ని ఈ నెల 15 నుంచి ప్రారంభించబోతున్నారు.

ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ యాక్షన్ సీన్ గ్రూఫ్ ఆఫ్ ఫైటర్స్ తో ప్లాన్ చేసారు. హైదరాబాద్ లోనే ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను అభిమానులకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.

English summary
It is being reported that megastar Chiranjeevi has finally zeroed in on his heroine for his landmark 150th film. Deepika Padukone has reportedly agreed to be cast as his heroine.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu