Raaka: అల్లు అర్జున్ మూవీ కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. వామ్మో ఇన్ని కోట్లా?

Deepika Padukone Raaka Remuneration: భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్ట్‌లలో ఒకటి 'రాకా' (Raaka). అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా, మొదటి పోస్టర్ విడుదలైన క్షణం నుంచే దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ముఖ్యంగా బన్నీ గుండుతో, సగం మనిషి - సగం మృగంలా కనిపించిన లుక్ సినిమా సోర్టీపై భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఇది సాధారణ కమర్షియల్ మూవీ కాకుండా, డార్క్ థీమ్‌తో కూడిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని స్పష్టమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించబోతుందట. ఇందుకోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇంతకీ ఎన్ని కోట్లంటే?

ఈ భారీ పాన్ ఇండియా సినిమాను సన్ పిక్చర్స్ (Sun Pictures)బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్యారలల్ యూనివర్స్, పునర్జన్మలు, మిథాలజీ అంశాలను కలిపి అట్లీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, అల్లు అర్జున్ ఈ సినిమాలో డ్యూయల్ లేదా ట్రిపుల్ రోల్స్‌లో కనిపించే అవకాశముందన్న టాక్ కూడా సినిమా హైప్‌ను మరింత పెంచుతోంది.

Deepika Padukone Charges Rs 25 Crore for Allu Arjun Atlee Film Raaka -New Record

ఈ భారీ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద ఆకర్షణగా నిలిచింది హీరోయిన్ ఎంపిక. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుండగా, ఆమె తీసుకుంటున్న పారితోషికం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. దీపికా ఈ సినిమా కోసం దాదాపు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. భారతీయ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్‌కు ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం చాలా అరుదు. ఈ విషయం ఒక్కటే 'రాకా'పై ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసింది.

అయితే దీపికా పదుకొణె గత కొంతకాలంగా వివాదాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొన్ని భారీ ప్రాజెక్టుల నుండి ఆమె తప్పుకోవడం వెనుక కారణంగా ఆమె పెట్టిన కఠినమైన నిబంధనలు-రోజుకు 8 గంటల పని పరిమితి, అధిక పారితోషికంఅని ప్రచారం జరిగింది. అయినప్పటికీ, 'రాకా' టీమ్ ఆమె డిమాండ్లను అంగీకరించి ఈ భారీ ప్రాజెక్టులోకి తీసుకురావడం, ఆమె క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేస్తోంది.

ఇక హీరో అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం దాదాపు రూ. 175 కోట్ల వరకు రెమ్యూనరేషన్, అలాగే లాభాల వాటా కూడా తీసుకోబోతున్నట్టు టాక్. ఇది ఆయన స్టార్‌డమ్ ఏ స్థాయిలో ఉందో చూపిస్తుంది. 'పుష్ప' సిరీస్ విజయాల తర్వాత బన్నీ పాన్ ఇండియా మార్కెట్‌లో ఏర్పరచుకున్న ఇమేజ్‌ను 'రాకా'తో మరింత గ్లోబల్ లెవల్‌కు తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మంధన్న కీలక పాత్ర పోషిస్తుందని, ఆమె కూడా రూ.5 నుంచి రూ.7 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ టీమ్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బన్నీ మృగం లుక్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, మేకప్, CGI ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి.ఇలా రాకా ఒక సాధారణ సినిమా కాదు-ఇది ఇండియన్ సినిమా స్కేల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారుతోంది.భారీ అంచనా క్రియేట్ చేస్తున్న ఈ సినిమా 2027 సమ్మర్‌లో విడుదల కానున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X