స్పిరిట్, కల్కి 2 తర్వాత.. మరో గ్లోబల్ ప్రాజెక్ట్ నుంచి దీపిక ఔట్?
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి రోజుల్లో ఈ హీరోయిన్ వరుస వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు, అంతర్జాతీయ అవకాశాలు వరుసగా చేజారుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పిరిట్ (Spirit), కల్కి 2 ( Kalki 2898 AD) సీక్వెల్ నుంచి ఆమె తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం అప్పట్లో ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీసింది. అయితే..ఇప్పుడు తాజాగా మరో గ్లోబల్ ప్రాజెక్ట్ కూడా ఆమె చేతులారా వదులుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఆ కారణాలేంటీ?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబోలో తెరకెక్కిన కల్కి 1లో నటించిన సుమతి అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు సిక్వెల్ గా వస్తున్న 'కల్కి 2'లో ఆమె నటించే అవకాశం వచ్చిన, వర్కింగ్ అవర్స్ కండిషన్ సెట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.

అలాగే ప్రభాస్- సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతోన్న 'స్పిరిట్' సినిమాలో దీపికకు లీడ్ రోల్ నటించే అవకాశం వచ్చింది.కానీ, ఇక్కడ కూడా వర్కింగ్ హవర్స్ సాకుతో మూవీ నుంచి వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ అవకాశమూ చేజారిందన్న ప్రచారం రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'ది వైట్ లోటస్' ఆఫర్ రిజెక్ట్?
హాలీవుడ్‌లో పాపులర్ సిరీస్‌గా రూపొందిన ది వైట్ లోటస్( The White Lotus ) సీజన్ 4 కోసం దీపికా పేరు పరిశీలించారని హాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హెచ్ బీఓ(HBO)లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ ప్రతి సీజన్‌లో కొత్త కథ, కొత్త పాత్రలతో ముందుకు వస్తూ అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇలాంటి గ్లోబల్ రీచ్ ఉన్న సిరీస్‌లో నటించే అవకాశం దక్కితే, అది ఏ నటుడికైనా కెరీర్‌లో మరో మైలురాయి. ముఖ్యంగా ఇండియన్ స్టార్ గా దీపికా నటిస్తే అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చేదనే అభిప్రాయం ఉంది.
ఆడిషన్ ప్రక్రియపై అభ్యంతరం?
తాజా నివేదికల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ కోసం దీపికను ఆడిషన్‌కు రావాలని మేకర్స్ కోరినట్లు సమాచారం. అయితే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లలో స్టార్ అయినా, కొత్తవారైనా అందరికీ ఒకే విధమైన ఆడిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇదే విధానం 'ది వైట్ లోటస్' టీమ్ కూడా అనుసరిస్తుంది. కానీ, తన స్థాయికి తగ్గట్టుగా నేరుగా ఆఫర్ రావాలని దీపిక భావించిందని, ఆడిషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది.
దీంతో ఆమె స్థానంలో మరో అంతర్జాతీయ నటిని ఎంపిక చేసే దిశగా మేకర్స్ ముందుకు సాగినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మరోవైపు, దీపిక ప్రస్తుతం స్క్రిప్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సరైన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని టాక్..
గతంలో xXx:రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే సినిమాతో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన దీపికా, అక్కడ మంచి గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత పెద్దగా అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ల్లో కనిపించలేదు. అందుకే 'ది వైట్ లోటస్' అవకాశం నిజమైతే, అది గ్లోబల్ కమ్‌బ్యాక్‌కు మంచి వేదిక అయ్యేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు మిక్స్డ్ టాక్ వస్తుంది. 'దీపిక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటుంది' అని కొందరు మద్దతు తెలుపుతుండగా, 'ఇంత మంచి అవకాశం ఎందుకు వదులుకుంది?' అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











