సూపర్ స్టార్ కోసం భారీ కాస్ట్యూమ్స్ లో దీపిక అందాలు...!
ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలు పోషిస్తూ... అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో అందాలు ఒలకబోస్తూ... నటిస్తూ వచ్చిన బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకునేకి తొలిసారిగా ఓ మంచి పాత్ర పోషించే అవకాశం వచ్చిందట. అందుకే తనిప్పుడు ఎవరైనా అడిగినా అడగకపోయినా కూడా, కనిపించిన వాళ్లందరికీ ఈ పాత్ర గురించే చెపుతోంది. ఈ పాత్ర 'రాణా' సినిమాలోది. రజనీకాంత్ హీరోగా నటించే ఈ సినిమాలో దీపికా ఓ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 17వ శతాబ్దానికి చెందిన కథతో రూపొందుతోంది.
ఆమధ్య 'దేవదాస్', 'జోధా అక్బర్' సినిమాలలో ఐశ్వర్యా రాయ్ పోషించిన పాత్రలాంటి పాత్ర తానిందులో చేస్తోంది. ఆమె కాస్ట్యూమ్స్ అన్నీ భారీ డిజైనింగ్స్ తో వుంటాయి. అందుకే ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా దీపికా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది. 'రజనీకాంత్ తో నటించడమే అదృష్టమనుకుంటే, ఇలాంటి అరుదైన పాత్ర చేయడం మరో అదృష్టమ'ని దీపికా మురిసిపోతోంది.!


Click it and Unblock the Notifications