AA22xA6 : దీపికా గొంతెమ్మ కోరికలు.. తలవొగ్గిన అట్లీ.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ బ్యూటీని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న చిత్రానికి హీరోయిన్ గా ప్రకటించారు. తాజాగా ఈ అధికారిక ప్రకటన వెలువడటంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ఈ బ్యూటీ మొన్నటి వరకు టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ తో వివాదంలో ఉండగా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకోవడం ఆస్తకిరంగా మారింది. ఈ సందర్భంగా ఆమె రెమ్యునేషన్, కండీషన్స్ వివరాలు షాకింగ్ గా ఉన్నాయి.
దీపికా పదుకొణె భారీ పారితోషికం..
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చివరిగా 'కల్కి 2898 ఏడీ' చిత్రంలో నటించి ఇండియా వ్యాప్తంగా తన మార్కెట్ ను పెంచుకుంది. దీపికా పదుకొణె చిత్రాలకు భారీ డిమాండ్ ఉడటంతో తన రెమ్యునరేషన్ ను కూడా పెంచేసింది. ఇక AA26xA6 ప్రాజెక్ట్ కోసం దీపికా పదుకొణె ఏకంగా రూ.30 కోట్లు డిమాండ్ చేసిందంట. మరి అందులో నుంచి ఎంత వరకు తగ్గించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి దీపికా పదుకొణె ఒక స్టార్ హీరో రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకోవడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గ్గా మారింది.

అట్లీకి దీపికా పదుకొణె కండీషన్స్..
AA26xA6 చిత్రంలో నటించేందుకు దీపికా పదుకొణె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడమే కాకుండా.. పలు కండీషన్స్ కూడా పెట్టింది. దర్శకుడు అట్లీ, నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థకు తను కావాల్సిన సౌకర్యాల గురించి షరతులు విధించినట్టు తెలుస్తోంది. తను షూటింగ్ కు రావాలంటే 5 స్టార్ హోటల్ లో 26 మెంబర్స్ స్టాఫ్ కు వసతి కల్పించాలని కండీషన్ పెట్టిందంట. అలాగే ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు ముంబై నుంచి షూటింగ్ లోకేషన్ కు స్పెషల్ ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలని సూచించిందంట. ఆ తర్వాత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టినట్టు తెలుస్తోంది.
ఇటీవల వివాదాల్లో దీపికా పదుకొణె..
దీపికా పదుకొణె ఇటీవల వివాదాల్లో చిక్కుకుంది. సందీప్ రెడ్డి వంగ - ప్రభాస్ కాంబినేషన్ లో రాబోయే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ సందీప్ రెడ్డి వంగ ఆమె కండీషన్స్ కు ఒప్పుకోలేదు. ఆ తర్వాత దీపికా పదుకొణె తన స్టోరీ గురించి కొన్ని లీక్స్ ఇవ్వడంతో వివాదంగా మారింది. దాంతో సందీప్ రెడ్డి వంగ కూడా దీపికా పదుకొణెపై మండిపడ్డారు.
దీపికా పదుకొణె నెక్ట్స్ సినిమాలు..
సౌత్ లో ప్రస్తుతం దీపికా పదుకొణె వరుస పెట్టి బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ వస్తోంది. ఏ పెద్ద ప్రాజెక్ట్ సెట్ అయినా ముందుగా దీపికా పదుకొణె దగ్గరకే దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్తుండటం విశేషం. ఇప్పటికే కల్కి 2898 ఏడీ చిత్రంలో అలరించిన సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ కల్కి 2తో పాటు, AA22xA6 చిత్రాల్లో నటిస్తోంది. ఇక 2024 సెప్టెంబర్ 8న పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో కాస్తా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వరుస బెట్టి ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











