పవన్ కళ్యాణ్ చిత్రంలో దీపిక పడుకోనే ఐటం సాంగ్ !?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో దీపిక పడుకోనే ఐటం సాంగ్ ఉండబోతోందని వినికిడి. మూడు పాటలు మినహా టోటల్ టాకీ పార్ట్ పూర్తి చేకుకున్న ఈ చిత్రంలో ఓ పాటకోసం హైదరాబాద్ లో కోటి రూపాయల ఖర్చుతో కాస్టలీ సెట్ వేయిస్తున్నారు. అలాగే మిగిలిన రెండు పాటలను అబ్రాడ్ లో షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. అందులో ఒక పాటని దీపికా మీద ఐటం సాంగ్ చేద్దామనే ఆలోచనని పవన్ ఓకే చేసాడని త్వరలోనే అది కార్యరూపం దాల్చనుందని సమాచారం. ఇక దీపిక పడుకోనేకీ, దర్సకుడు జయంత్ కీ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి.
అందుకే దీపికా రిలీజ్ కు నోచుకోని జయంత్ చిత్రం లవ్ ఫర్ ఎవర్ లో ఐటం సాంగ్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ చిత్రం అనగానే ఆమెకూ ఆసక్తి ఉందని, సౌత్ లో చేద్దామనే ఆలోచన ఉన్న ఆమెకు రెమ్యునేషన్ సమస్య వచ్చి ఆగుతోందని, ఈ పాటతో ఇక్కడ క్రేజ్ తెచ్చుకుని ఇక్కడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











