twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ చిత్రంలో దీపిక పడుకొనె!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చర్కర్లు కొడుతోంది. బాలీవుడ్ హాట్ లేడీ దీపిక పడుకొనెతో ఈచిత్రంలో ఐటం సాంగ్ చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ మేరకు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఆమెను కలిసారని అంటున్నారు. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

    పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్రస్తుతం 'సరదా'(తాత్కాలిక టైటిల్) పేరుతో పిలుస్తున్నారు. ఇటీవలే లాంచనంగా పూజా కార్యక్రమం జరుపుకున్న ఈచిత్రం జనవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తమ చిత్రం కోసం అద్భుతమైన లొకేషన్లు వెతకడంలో భాగంగా యూరఫ్ ఖండంలోని స్పెయిన్ లో పర్యటిస్తున్నారు. ఈ వెతుకులాటలో తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా జాయిన్ అయ్యాడు. పనిలో పనిగా దేవిశ్రీ ఇక్కడే ఈ ఇద్దరితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసారు.

    ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్‍‌గా చేస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు. నటీనటుల వివరాలు, ఇతర సాంకేతిక విభాగం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

    English summary
    
 According to film Nagar source...Bollywood actress Deepika Padukone is going to make Item song in Powerstar Pawan Kalyan's new movie in the direction of Trivikram Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X