»   » తండ్రి చూస్తుండగానే సిద్ధార్థ మాల్యాకు ముద్దు ఇచ్చిన దీపికా పదుకొణె

తండ్రి చూస్తుండగానే సిద్ధార్థ మాల్యాకు ముద్దు ఇచ్చిన దీపికా పదుకొణె

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్య కుమారుడు సిద్ధార్థ్ మాల్యా రొమాన్స్‌లో తన తండ్రిని మించిపోయాడు. అందమైన అమ్మాయిలను ఎలా బుట్టలో వేసుకోవాలో కూడా సీనియర్ మాల్యాకు ఈ జూనియర్ మాల్యా పాఠాలు నేర్పే అవకాశం ఉందంటున్నారు ఇటీవల ఓ సంఘటన చూసిన వాళ్శంతా. బాలీవుడ్ సెక్సీ స్టార్ దీపికా పదుకొణెతో ప్రేమాయణం సాగిస్తున్న సిద్ధార్థ్ ఆమె అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని బాలీవుడ్ జనం కొడై కూస్తున్నారు. ఐతే దీపికా కూడా సిద్ధార్థ ఊహించని గిఫ్ట్ ఇచ్చిందని సమాచారం. ఇటీవల కాలంలో 16 కోట్ల విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికాకు సిద్ధార్థ బహుమతిగా ఇచ్చిన విషయం తేలిసిందే.

సిద్ధార్థ ఇచ్చిన పాష్ గిఫ్ట్‌కు దీపికా కూడా ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. జనవరి 5న దీపికా పుట్టినరోజు కావడంతో ఆమెను సిద్ధార్థ జనవరి ఒకటోతేదీన డెన్మార్క్‌లోని కోపెన్హగెన్‌కు తీసుకువెళ్లాడు. దీంతో దీపికా షాక్ గురై ఆశ్చర్యం, ఆనందాలలో మునిగిపోయింది. దానికి కారణం అది తాను పుట్టిన ప్రదేశం కావడమే. దీంతో ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ మాల్యాకు సీనియర్ మాల్యా చూస్తుండగానే ముద్దు ఇచ్చేసిందిట. ఇది చూసి అవాక్కయిన సీనియర్ మాల్యా ముక్కున వేలేసుకుని పక్కకు వెళ్లిపోయారట. పాపం సిద్ధార్థ ఒక్క ముద్దు కోసం రూ16 కోట్లు ఖర్చు పెట్టాడని సినీ జనం జాలి చూపిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu