అతనితో కలసి తిరుగుతున్న దీపికా..!!
కెరీర్ మొదలెట్టిన తొలిరోజుల్లో పాలబుగ్గల హీరో రణ్ భీర్ కపూర్ తో ప్రేమాయణం సాగించిన దీపికా పదుకునే అంతకు ముందు క్రేజ్ తెచ్చుకోవడానికి ధోనీ, యువరాజ్ సింగ్ అంటూ ఎవరికి పేరుంటే వారందరితోనూ తిరిగింది. ఇందులో రణ్ భీర్ తో వ్యవహారం చాలా రోజులే నడిచినా ఆ తర్వాత ఇద్దరికీ ఒకరంటే ఒకరికి బోర్ కొట్టి వదిలించుకున్నారు.
మరి ఇంకో నాలుగు రోజుల్లో వాలెంటైన్స్ డే వస్తోంది. ఆ రోజును ఎవరితో కలసి ఎంజాయ్ చెయ్యాలని ఆలోచించిన దీపిక యంగ్ అండ్ క్యూట్ గై షాహిద్ కపూర్ ను బుట్టలో వేసిందట. షాహిద్ కూడా కరీనా, ప్రియా్కా చోప్రా, జెనీలియా అంటూ పెద్ద లిస్టే మెయిన్ టెయిన్ చేసాడు. సో ప్రస్తుతానికి వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారట. ఏంటిది దీపికా అంటే మరేం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎప్పుడూ చెప్పేదే బట్టీపట్టినట్టు టకటకా చెబుతోంది. మరీ వ్యవహారం ఎన్నిరోజులో మరి...దీపకకే తెలియాలి.


Click it and Unblock the Notifications











