Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Prabhas 21: దీపికా కోసం ప్రభాస్ కూడా తగ్గాల్సిందే.. అన్ని కోట్లిచ్చి ఇన్ని పాట్లు పడాలా?
ప్రభాస్ బాహుబలి తరువాత ప్యూర్ పాన్ ఇండియా హీరో అనే లిస్ట్ లోకి వచ్చేశాడు. భవిష్యత్తులో రెబల్ స్టార్ ఏ సినిమా చేసినా కూడా బడ్జెట్ 150కోట్లకు తక్కువ ఉండేలా కనిపించడం లేదు. పూర్తిగా పాన్ ఇండియా సినిమాలుగా రూపొందించాలి కాబట్టి సినిమాలో క్యాస్టింగ్ కూడా భారీ స్థాయిలోనే ఉండాలి. ఇక ఇటీవల ప్రభాస్ 21వ సినిమా కోసం దీపికా పదుకోన్ ని సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె వల్ల చిత్ర యూనిట్ కి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
డ్జెట్ మునుపెన్నడు లేనంతగా
వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ మొదటిసారి నటిస్తున్నాడు కాబట్టి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా బడ్జెట్ మునుపెన్నడు లేనంతగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ దాదాపు 350కోట్లకు పైగానే ఖర్చు చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అంచనాల డోస్ మరింత పెరిగింది
దీపికా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకోగానే సినిమాపై అంచనాల డోస్ మరింత పెరిగింది. అయితే ఆమె సినిమా ఒకే చేయడానికి ముందు పెట్టిన కండిషన్స్ అన్ని ఇన్ని కావట. మొదట అమ్మడు రెమ్యునరేషన్ దగ్గర నిర్మాతకు గట్టిగానే చుక్కలు చూపించిందట. ప్రభాస్ కి ఇచ్చినంత తనకు కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది.
30కోట్ల డిమాండ్
ప్రభాస్ రెమ్యునరేషన్ ఇప్పుడు 50కోట్లకు పైగానే ఉంటోంది. ఇక దీపికకు కూడా ఆ రేంజ్ లో ఇవ్వాలి అంటే చాలా కష్టం అని చెప్పడంతో 30కోట్లను డిమాండ్ చేసిందట. కానీ వైజయంతి మూవీస్ డీల్స్ సెట్ చెసుకోవడంలో ముందు నుంచి ప్రావీణ్యం ఉన్న సంస్థ కాబట్టి 25కోట్లకు లోపలే డీల్ ని సెట్ చెలుకున్నట్లు తెలుస్తోంది.
ఆ ఎఫెక్ట్ ప్రబాస్ పై
ఇక ఆ రెమ్యునరేషన్ కి ఒప్పుకోవడంతో అమ్మడు కాల్షీట్స్ విషయంలో చాలా దృఢంగా ఒక నిర్ణయాన్ని చెప్పిందట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు కాబట్టి డేట్స్ తనకు వీలైనప్పుడే ఇస్తానని తెగేసి చెప్పిందట. దీంతో ఆ ఎఫెక్ట్ ప్రబాస్ పై పడినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఆమెకు వీలు ఉన్నపుడే
సాధారణంగా హీరో డేట్స్ కుడిరితేనే మిగతా వారి డేట్స్ అడ్జస్ట్ చేస్తుంటారు. అయితే ప్రభాస్ ఇప్పుడు 21వ సినిమా కోసం పని చేయాలి అంటే దీపికా ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు సినిమా షూటింగ్ ఆమెకు వీలు ఉన్నపుడే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.