twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భర్తతో దీపిక పదుకోన్ రొమాన్స్.. ఆమె తీసుకోబోయే రెమ్యునరేషన్ తెలిస్తే షాకే..

    |

    ప్రేమలో ఉండగా బాలీవుడ్ తారలు రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోన్ కలిసి హిందీ పరిశ్రమను ఊపేశారు. వారిద్దరి కాంబినేషన్, కెమిస్ట్రీ తెర మీద క్రేజీగా మారింది. రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావతి చిత్రాల్లో ఈ జంట అద్భుతంగా ఆకట్టుకొన్నది. అయితే ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూద్దామనుకొన్న అభిమానులకు సడెన్ షాక్ ఇచ్చారు.

    తాజాగా రణ్‌వీర్, దీపికా కలిసి 83 అనే క్రికెట్ నేపథ్యంగా సాగే చిత్రంలో నటిస్తున్నారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో కపిల్ దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ కనిపించబోతున్నాడు. కపిల్ దేవ్ సతీమణి భార్య పాత్రను దీపికా పదుకోన్ పోషించనున్నారు.

    Deepika Padukone offered 14 crores for 83 movie

    వాస్తవానికి దీపిక ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపలేదట. కానీ కథ విన్న తర్వాత తన పాత్ర ప్రాధాన్యత తెలుసుకొన్న తర్వాత ఒకే చెప్పారట. అంతేకాకుండా నిర్మాతలు భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో వెంటనే ఒప్పుకొన్నారట. ఈ సినిమాలో నటించినందుకు దీపిక పదుకోన్‌కు రూ.14 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ రేంజ్‌ రెమ్యూనరేషన్ బాలీవుడ్‌లో ఎవరైనా తీసుకొన్నారా? అంటే కొంత డౌట్ పడాల్సిందే.

    English summary
    Bollywood actress Deepika Padukone doing 83 movie with hubby Ranveer Singh. She is doing role as wife of Kapil Dev. For this role, She was offered 14 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X