దీపిక పెళ్లి ఆ టైపులో చేసుకుంటుందట
ఆలు లేదు, చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు....ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేనే లేదు, ఎవరిని చేసుకుంటందో కూడా డిసైడ్ చేసుకోలేదు, పెళ్లి గురించి మాత్రం తెగ కలలు కంటోంది బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె. ప్రతి అమ్మాయి తన పెళ్లి గురించి కలలు కనడం కామనే అయినా దీపిక మరీ ఇంత అడ్వాన్స్ గా ఉండటం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దీపిక తన పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం కాకుండా ఆ...టైపులో చేసుకుంటుందట. ఆ టైపు అంటే అదేదో అనుకుని అపార్థం చేసుకోవద్దు సుమీ. కిష్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటుందట.
అమ్మడుకి 'వెన్డెల్స్ రాడ్రిక్" పెళ్లి గౌను డిజైన్స్ అంటే తెగ ఇష్టమట. అలాంటి గౌను వేసుకుని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచే అనుకుంటుందట. ఇటీవలే తన మనసులోని ఈ విషయాన్ని బయట పెట్టింది దీపిక. మరి దీపికను పెళ్లి చేసుకోబోయే వాడు కూడా క్రిష్టియన్ అయితే ఫర్వాలేదు. మరి ఒకవేళ కాక పోతే ఏమిటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే... సొల్లు కబుర్లు మాని, కెరీర్ లో పైకి రావడానికి సొల్యూషన్ ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు మరికొందరు. బాలీవుడ్ లో చాలా మందితో ఎఫైర్లు నడుపుతున్న దీపిక చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











