రాకా నుంచి దీపిక పదుకొణె ఔట్? దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు.. అనూహ్యంగా నటీనటుల ప్లేస్‌లు మారిపోతున్నాయి. ఒక సినిమాలో నటిస్తోన్న వారు ఎప్పుడు ఉంటారో? ఎప్పుడు బయటికి వెళ్లిపోతారో తెలియడం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ ట్రెండ్ సాగుతోంది. కొందరు హీరోయిన్లకైతే ఇది శాపంగా మారుతోంది. అందులోనూ దీపిక పదుకొణె పరిస్థితి దారుణంగా తయారైంది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకున్నట్లుగా వార్తలు రావడంతో ఆమె స్పందించారు.
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా, ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు దీపిక పదుకొణె. అందం, అభినయంతో ఆమె నెంబర్ వన్‌గా ఎదిగారు. అయితే గత కొంతకాలంగా దీపిక టైం బాగున్నట్లుగా లేదు. వరుసపెట్టి ఆమెను పలు ప్రాజెక్ట్స్ నుంచి తప్పిస్తున్నారు. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కుతోన్న స్పిరిట్ మూవీ నుంచి తొలుత దీపికను తప్పించారు. ఈ విషయం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ షాక్ నుంచి కోలుకోకముందే దీపికను మరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు.

ప్రభాస్- నాగ్ అశ్విన్‌ల బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న కల్కి 2 నుంచి దీపిను తప్పిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్ధ వైజయంతీ మూవీస్ ప్రకటించడం టాలీవుడ్, బాలీవుడ్‌లలో చర్చనీయాంశమైంది. ఇలా వరుసపెట్టి దీపికను ఎందుకు తప్పిస్తున్నారు? దీని వెనుక కారణాలేంటీ? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీపిక పదుకొణె పెట్టే కండీషన్స్ వల్లే ఆమెకు ఇలాంటి పరిస్ధితి ఎదురవుతోందని బీటౌన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత రోజుకు 8 గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పడం, పెద్ద మొత్తంలో పారితోషకం, ఇతర భత్యాలు కావాలని డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలు దీపిక విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఐకాన్‌స్టాన్ అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న రాకాతో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ - సిద్ధార్ధ్ ఆనంద్‌ల కలయికలో వస్తోన్న కింగ్ మూవీలో దీపిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా పరుగులు తీస్తోన్న వేళ.. దీపిక విషయంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల దీపిక పదుకొణె రెండోసారి గర్భం దాల్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రెగ్నెంట్ అయిన మహిళలు ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రాకా నుంచి దీపిక తప్పుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
8 గంటల వర్క్ కల్చర్, ఇతర కండీషన్స్‌కి ఓకే చెప్పి మరి దీపికను రాకాలోకి తీసుకున్నాడు అట్లీ. షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇందులో దీపికకు యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయట. దీనికి కావాల్సిన శిక్షణను కూడా ఆమె తీసుకుంటున్నారట. ఇలాంటి దశలో ఆమె గర్భం దాల్చడంతో ఆరోగ్య కారణాలు, బిడ్డ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దీపిక... అట్లీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలను దీపిక ఖండించినట్లుగా తెలుస్తోంది.
గర్భం దాల్చినప్పటికీ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తున్నారట. అలాగే రాకాలో యాక్షన్ సీక్వెన్స్‌లో నటించేందుకు కూడా దీపిక సిద్ధంగానే ఉన్నారట. నిపుణులు, డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని రాకా షూటింగ్‌ను పూర్తి చేయాలని దీపిక భావిస్తున్నారట. అటు అట్లీతో పాటు చిత్ర యూనిట్ కూడా దీపిక పార్ట్‌ను త్వరగా పూర్తి చేసి ఆమెకు విశ్రాంతి ఇచ్చేలా షెడ్యూల్స్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications



