టాప్ లెస్ ఫోజిస్తే ఏడున్నర కోట్లు ఇస్తామంటే, వద్దంటోంది..?
సినిమా తారలు డబ్బులిస్తే ఎంతకైనా తెగిస్తారంటారు. మంచి పారితోషికం ఇస్తే లిప్ లాక్ కిస్సులూ గట్రా కూడా చేసేస్తున్నారు. అలాగే రేటుని బట్టి బికినీ కూడా ధరించడానికి రెడీగా వున్న హీరోయిన్లు కూడా వున్నారు. అయితే, బాలీవుడ్ తార దీపికా పదుకొనే ఇటీవల ఓ భారీ ఆఫర్ని తిరస్కరించిందట.
ఇంటర్నేషనల్ మెన్స్ మేగజైన్ 'ప్లే బాయ్' కవర్ పేజ్ కోసం దీపికా టాప్ లెస్ గా ఫోటో సెషన్ చేస్తే ఏడున్నర కోట్లు ఇస్తామంటూ బేరం పంపారట. అంత భారీ మొత్తంతో కూడిన ఆఫర్ కి మరో తారైతే ఎగిరి గంతేసి, వెంటనే సెషన్ పెట్టుకోమనేదే. అయితే, దీపికా మాత్రం దానిని సున్నితంగా రిజక్ట్ చేసిందట. ఇప్పటికే పబ్లిక్ గా సిద్ధార్థ్ మాల్యాని ముద్దులాడి కుటుంబపరువు తీశావంటూ ఇంట్లో క్లాసులు ఎక్కువయ్యాయేమో... 'ఆ టైపు పోజులివ్వలేను. మా ఫ్యామిలీ పరువు చూసుకోవాలి కదా' అంటూ ఆ ఆఫర్ని వదులుకుందట దీపికా.


Click it and Unblock the Notifications











