»   » ‘ఫాస్ట్ & ఫ్యూరియస్-7’ ఆఫర్ వదులుకున్న దీపిక

‘ఫాస్ట్ & ఫ్యూరియస్-7’ ఆఫర్ వదులుకున్న దీపిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెకు హాలీవుడ్ మూవీ 'ఫాస్ట్ & ఫ్యూరియస్-7'లో నటించే అవకాశం వచ్చిన తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈఆఫర్‌ను దీపిక పదుకొనె కావాలనే వదులుకున్నట్లు తెలుస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లనే దీపిక ఇలా చేసిందట.

'ఫాస్ట్ & ఫ్యూరియస్-7' సినిమా కోసం ఆ చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదించారు. షూటింగ్ నిమిత్తం వచ్చే ఏడాది జనవరి వరకు యూఎస్‌లో ఉండాలని షరతు పెట్టారు. దీపిక ఇప్పటికే పలు బాలీవుడ్ ఆఫర్లు కమిటై ఉన్నందున అంతకాలం యూఎస్‌లో ఉండలేనని తేల్చి చెప్పిందట దీపిక.

deepika padukone

అంత పెద్ద హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేక పోతుండటంపై కాస్త అప్ సెట్‌గా ఉందట. భారీ చేజ్‌లు, యాక్షన్‌కు పెట్టింది పేరు 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌. ఈ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనివర్శల్‌ పిక్చర్స్‌ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటిస్తున్నారు.

దీపిక బాలీవుడ్ ప్రాజెక్టుల విషయానికొస్తే ఆమె నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ఇటీవల విడుదలై భారీ విజయం సాధించింది. ఆమె నటించిన 'రామ్ లీలా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. రజనీకాంత్‌కు జోడీగా దీపిక నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. మరో వైపు షారుక్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'హ్యాపీ న్యూఇయర్' చిత్రంలో కూడా దీపిక నటిస్తోంది.

English summary
It seems like the leggy lass of Bollywood, Deepika Padukone is too occupied with projects, that she just turned down the much desired Hollywood break! Deepika Padukone has turned down the offer to appear in Fast And Furious 7.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu