Project K కల్కి మూవీలో దీపిక పదుకోన్ రోల్ లీక్.. ఊహకు అందని పాత్రలో బాలీవుడ్ బ్యూటీ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కల్కి. దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి అగ్రతారలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి దీపిక పదుకోన్ రోల్ గురించి ఓ వార్త లీక్ అయింది. ఈ పాత్ర వివరాల్లోకి వెళితే..
కల్కి మూవీ స్టోరీ లైన్ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మహాభారతంతో మొదలయ్యి 2898వ సంవత్సరంతో ముగుస్తుంది, ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ మైథాలాజి నేపథ్యంతో రాబోతుందని పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్.. విష్ణుమూర్తి 10వ అవతారం అయిన కల్కి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

ఇక ఈ మూవీలోని ఇతర పాత్రలు గురించి మాట్లాడుకుంటే.. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, బలి చక్రవర్తిగా కమల్ హాసన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే పరుశురాముడు, వేద వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్య పాత్రలు కూడా కనిపించనున్నాయని. ఆ పాత్రలను రాజమౌళి, దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నాని పోషించనున్నారని టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ మూవీలో నటించబోయే ఇతర నటీనటులు కూడా హిందూ పురాణాల్లోని పాత్రలతోనే ఆడియన్స్‌ని పలకరించనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటిస్తున్న దీపికా పదుకోన్.. పద్మ పాత్రలో కనిపించబోతున్నారట. హిందూ మైథాలాజి ప్రకారం ఈమె కల్కి భార్యగా చెబుతుంటారు. కల్కి అవతారంలో పద్మ పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుందని, కల్కి చేసే పోరాటంలో పద్మ కూడా భాగం అవుతుందని చెబుతున్నారు. మరి మూవీలో దీపికా పాత్ర ఆడియన్స్ ని ఎలా థ్రిల్ చేయబోతుందో చూడాలి.
అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో ఓ పురాణాలకు సంబంధించిన పాత్రతో కనిపింబోతున్నారని సమాచారం. మహాభారతంతో మొదలయ్యే ఈ సినిమాలో కృష్ణుడి పాత్రని కూడా చూపించబోతున్నారు. ఈక్రమంలోనే ఆయన ప్రియురాలు అయిన రాధ పాత్రలో మృణాల్ ని చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలు అన్నిటిలో ఎంత నిజముందో తెలియదు గానీ, ఆడియన్స్ లో మాత్రం ఈ వార్తలు అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ వార్తలు అన్నిటికి సమాధానం దొరకాలంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నెల 8న శివరాత్రి సందర్భంగా మూవీ టీజర్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. శివరాత్రి నుంచే ఈ మూవీ ప్రమోషన్స్ ని మొదలుపెట్టనున్నారట. మరి ఆ రోజు ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











