»   »  ఆ హీరోయిన్‌‌తో రూ. 4 కోట్ల కార్పొరెట్ డీల్?

ఆ హీరోయిన్‌‌తో రూ. 4 కోట్ల కార్పొరెట్ డీల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్ దీపిక పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్లో నెం.1 పొజిషన్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఆమె నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'రామ్ లీలా' చిత్రాలు సంచలన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్పొరెట్ సంస్థ కోకా‌కోలా దీపికతో భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ సంస్థ దీపికను తమ ఉత్పత్తుల ప్రచారానికి నియమించుకున్నందుకు‌ గాను రూ. 4 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీపికకు ప్రస్తుతం యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

 Deepika Padukone

ప్రస్తుతం సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో థమ్స్ అప్, పెప్సి లాంటి పానీయాల జోరు కొనసాగుతోంది. ఈ రెండు బ్రాండ్లకు సినిమా రంగంలోని ప్రముఖ స్టార్లు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోటీని తట్టుకోవడానికి...అమ్మకాలు పెంచుకోవడానికి దీపిక పదుకొనెను రంగంలోకి దింపుతోంది కోకాకోలా.

ఇక దీపిక సినిమాల విషయానికొస్తే....రజనీకాంత్‌కు జోడీగా ఆమె నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో ఆమె నటిస్తున్న 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రీకరణ దశలో ఉంది. ఫైడింగ్ ఫన్నీఫెర్నాండెజ్ అనే ఇంగ్లీష్-కొంకణి ద్విబాషా చిత్రంలోనూ దీపిక నటిస్తోంది.

English summary
Deepika Padukone, who is riding high on the success of her films Ram Leela and Chennai Express has been roped in to endorse Coca Cola at a whooping amount of Rs 4 crore annually!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu