twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చినా బేరమాడుతోంది.. హాట్ బ్యూటీ స్ట్రాంగ్ డిమాండ్?

    |

    బాహుబలి అనంతరం ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పెరిగిపోయింది. దాదాపు బాలీవుడ్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉందని నీరూపించుకున్న ప్రభాస్ ఇప్పుడు చాలా మందికి ఫెవరేట్ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు కూడా ప్రభాస్ గురించి ప్రస్తావన వస్తే చాలు తెగ పొగిడేస్తున్నారు. ప్రభాస్ తో నటించడానికి చాలా మంది బ్యూటీలు రెడీ అవుతుంటే ఒక హాట్ బ్యూటీ మాత్రం ఎవరు ఊహించని విధంగా రెమ్యునరేషన్ దగ్గర బేరమాడుతోందట.

     ప్రభాస్ అంటే రెడీ..

    ప్రభాస్ అంటే రెడీ..

    సాహూ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో మరో రేంజ్ కి వెళ్లాడనే చెప్పాలి. ఆ సినిమా సౌత్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి హిందీలో మాత్రం మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియెన్స్ వరకు అందరిని ఎట్రాక్ట్ చేసింది. ఆ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ కూడా ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి రెడీ అనేసింది అంటే ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందొ చెప్పవచ్చు.

    బేరమాడుతున్న బాలీవుడ్ బ్యూటీ..

    బేరమాడుతున్న బాలీవుడ్ బ్యూటీ..

    ప్రభాస్ తో నటించడానికి చాలా మంది బ్యూటీలు రెడీ అవుతుంటే ఒక హాట్ బ్యూటీ మాత్రం ఎవరు ఊహించని విధంగా రెమ్యునరేషన్ దగ్గర బేరమాడుతోందట. ఆమె ఎవరో కాదు. దీపికా పదుకొనె. వైజయంతి ప్రొడక్షన్ లో మహానటి దర్శకుడు ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ భామని సంప్రదించడట.

    సౌత్ అంటే నచ్చదా?

    సౌత్ అంటే నచ్చదా?

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన ఈ భామ మొదటి నుంచి సౌత్ ఇండస్ట్రీ అంటే కాస్త దూరంగానే ఉంటోంది. ఎన్ని అవకశాలు వచ్చినా కథ వినకుండానే చాలా సార్లు నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో కూడా దీపిక చాలా సార్లు సౌత్ నిర్మాతలతో డిస్కర్స్ చేసి నచ్చకపోవడంతో నో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

    Recommended Video

    Prabhas Rejected 10 Super Hit Movies In His 17 Years Career In Film Industry
     స్ట్రాంగ్ డిమాండ్..

    స్ట్రాంగ్ డిమాండ్..

    ప్రభాస్ 21వ సినిమా కోసం దీపికను సంప్రదించగా అమ్మడు 20 నుంచి 25కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. పద్మావత్ సినిమా అనంతరం 15కోట్ల వరకు ఒక సినిమాకు అందుకుంటున్న ఈ హాట్ బ్యూటీ పాన్ ఇండియా మూవీ అని తెలిసి రెమ్యునేషన్ డోస్ పెంచుతోందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    One of the Bollywood star heroines deepika padukone so many times rejects south projects, Even in the case of remuneration, Deepika has often been disliked by the producers of the South. And she demands high remuneration for prabhas upcoming pan india movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X