రాకాలో దీపిక పదుకోన్ రెమ్యునరేషన్ లీక్.. అల్లు అర్జున్ పారితోషికం కంటే అంత తక్కువనా?
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ ఇటీవల కాలంలో రకరకాల వివాదాల్లో వినిపిస్తూ కనిపిస్తూ మీడియాకు హెడ్‌లైన్లుగా మారారు. అయితే వివాదాలను ఏమీ పట్టించుకోకుండా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా చిత్రంలో ఓ హీరోయిన్‌గా పాత్రను పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమా కోసం ఆమె రెండు రకాల వివాదాల్లో కూరుకుపోయారు. అయితే ఆమె కోరుకొన్నట్టు భారీగా పారితోషికం ఇస్తున్నట్టు మీడియా రిపోర్టులు వచ్చాయి. అయితే దీపిక పదుకోన్ రెమ్యునరేషన్ చూస్తే అల్లు అర్జున్ కంటే ఏడు రెట్లు తక్కువ అనే విషయం తాజాగా డెక్కన్ క్రానికల్ కథనంతో లీక్ అయ్యింది. అయితే అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత? దీపిక పదుకోన్ పారితోషికం ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

రాకా సినిమాకు ముందు దీపిక పదుకోన్ తెలుగు ప్రేక్షకులకు కల్కి 2898 AD సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అయితే ప్రభాస్‌తో సందీప్ రెడ్డ వంగా రూపొందిస్తున్న స్పిరిట్ సినిమా కోసం హీరోయిన్‌గా అడిగారు. అయితే ఆమె గొంతెమ్మ కోరికలు కోరడం వివాదంగా మారింది. 50 కోట్ల రూపాయల పారితోషికం, తన 25 మంది సిబ్బందికి ఫైవ్ స్టార్ హోటల్‌లో బస, తమ టీమ్ కోసం ప్రత్యేక విమానం లాంటి డిమాండ్స్‌తోపాటు సినిమా లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడగడంతో ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా కల్కి 2 నుంచి కూడా తప్పించడం జరిగిన విషయం తెలిసిందే.
అయితే రాకా సినిమా కోసం దీపిక పదుకోన్ పారితోషికం గురించి మీడియాలో భారీగానే చర్చ జరిగింది. ఆమెకు సుమారుగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు డెక్కన్ క్రానికల్ తన కథనంలో వెల్లడించింది. అయితే స్పిరిట్ సినిమా కోసం పెట్టి డిమాండ్లు లేకుండానే ఆమె ఈ సినిమా కోసం పనిచేస్తున్నారనే విషయం పలు మీడియా కథనాల్లో వచ్చాయి.
అయితే గతంలో పురుషులతో సమానంగా పనిగంటలు ఉండకూడదు. అలాగే రెమ్యునరేషన్ కూడా సమానంగా ఉండాలని మహిళా నటీమణుల హక్కుల కోసం పోరాటం చేశారు. అయితే ఇవేమీ లేకుండా అల్లు అర్జున్ కంటే చాలా తక్కువ పారితోషికం తీసుకొంటున్నారు. ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ సుమారుగా 175 కోట్ల రూపాయలు అని కథనంలో పేర్కొన్నారు. అయితే దీనిని బట్టి చూస్తే దీపిక రెమ్యునరేషన్ మాత్రం ఏడు రెట్లు తక్కువ అనే విషయం బయటకు వచ్చింది. అయితే ఈ వివరాలు అధికారికంగా కాకపోయినప్పటికీ.. వీటిపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్నది.
ఇక ఈ సినిమాలో దీపిక పదుకోన్‌తోపాటు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ థాకూర్ తదితరులు నటిస్తున్నారనే వార్త క్రేజీగా మారింది. ఈ సినిమా మరికొందరు టాప్ యాక్టర్లను కూడా బరిలోకి దించుతున్నారు. అట్లీ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్నది. ఈ మూవీని సన్ పిక్చర్స్ సుమారుగా 700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్నది. 2026 చివర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications

















