twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని 'జెండాపై కపిరాజు' రిలీజ్ వెనక్కి...??

    By Srikanya
    |

    nani
    హైదరాబాద్ : మొన్న శుక్రవారం నాని తాజా చిత్రం 'పైసా' విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే అమలా పాల్ తో నాని కలిసి చేసిన 'జెండా పై కపి రాజు' చిత్రం ఫిబ్రవరి 14 న విడుదల కావాల్సివుంది . కాని తాజా సమాచారం ప్రకారం ఈ ద్వి బాషా చిత్రం రిలీజ్ వాయిదా పడే అవకాసం ఉందని తెలుస్తోంది. తమిళ వెర్షన్ లో చేస్తున్న జయం రవి ఈ విషయమై మీడియాకు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. తెలుగులో ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ రెండు వెర్షన్స్ ఒకేసారి విడుదల చేద్దామనే ఆలోచన ఉంది కాబట్టి,తమిళ వెర్షన్ వాయిదా పడటంతో తెలుగు వెర్షన్ సైతం ఫోస్ట్ ఫోన్ అయ్యే అవకాసం ఉంది.

    నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

    నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. నిర్మాత మాట్లాడుతూ...ఇప్పటికి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నాని ఇందులో చేసే రెండు పాత్రలూ చాలా వైవిధ్యంగా ఉంటాయి. శరత్‌కుమార్ పాత్ర ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది అని చెప్పారు.

    అమలాపాల్‌ హీరోయిన్ . సముద్రఖని దర్శకుడు. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, కె.ఎస్‌.శివరామ్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో తమిళ నటుడు శరత్‌కుమార్‌ సి.బి.ఐ. అధికారిగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

    English summary
    
 Jenda Pai Kapiraju, starring Nani and Amala Paul, was all set for release on February 14. However, there seems to be some change in plans. Directed by Samuthirakani, the film also stars Ragini Dwivedi in lead roles and it has been simultaneously shot in Telugu and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X