‘గబ్బర్ సింగ్’ కలెక్షన్లపై సీబీఐ విచారణ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు వచ్చినన్ని కలెక్షన్లు ఏ సినిమాకు రాలేదంటూ అతిశయోక్తి కాదేమో. నేషనల్ మీడియా కూడా 'గబ్బర్ సింగ్' కలెక్షన్లపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
ప్రముఖ బిజినెస్ డైలీ'బిజినెస్ స్టాండర్డ్' తన వెబ్‌సైట్ కథనంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 1 వరకు రూ. 128.75 కలెక్షన్లు రాబట్టిందని పేర్కొంది. గతంలో వచ్చిన మహేష్ బాబు 'దూకుడు' చిత్రం డిసెంబర్ 2011లో విడుదలై మూడు వారల్లో 83.15 కోట్ల వసూళ్లు సాధించిందని, 2009లో వచ్చిన రామ్ చరణ్ తేజ్ 'మగధీర' చిత్రం మూడు వారాల్లో రూ. 90 కోట్లు వసూలు చేసిందని...తాజాగా గబ్బర్ సింగ్ ఆచిత్రం రికార్డు అధిగమించిందని 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక పేర్కొంది.
అయితే 'గబ్బర్ సింగ్' కలెక్షన్లు 100 కోట్లు దాటాయని చెబుతున్న నేషనల్ మీడియా కథనతో నిర్మాత గణేష్ అస్సలు ఏకీభవించడం లేదట. సినిమా కలెక్షన్లు వంద కోట్లు దాట లేదని అంటున్నారట. మరి ఎంత వసూలు చేసింది? అంటే మాత్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అయితే నిర్మాత ప్రవర్తనపై అభిమానులు ఇరిటేట్ ఫీలవుతున్నాడు. తమ హీరో కలెక్షన్ల గురించి తాము గొప్పగా చెప్పుకుంటేంటే....128 కోట్ల వసూళ్ల మ్యాటర్‌ను ఖండించడం ఏమిటని మండి పడుతున్నారు. కలెక్షన్ల గురించి ప్రచారం చేయవద్దని పవర్ స్టార్ చెప్పడాన్ని అదునుగా తీసుకున్న నిర్మాత గణేష్ లాభాలను తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వాస్తవాలు తేలాలంటే CBI (Correct Boxoffice Inquiry) విచారణ జరిపించి వివరాలు బహిర్గతం చేయాలని కొందరు మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే పవర్ స్టార్ సినిమా గురించి తాము తలెగరేసి చెప్పుకునే అవకాశం లభిస్తుందని అంటున్నారు. మరి అభిమానుల అగ్రహాన్ని చూసైనా నిర్మాత 'గబ్బర్ సింగ్' కలెక్షన్లపై అఫీషియల్ ప్రకటన చేస్తారా..?


Click it and Unblock the Notifications











