ఆరెంజ్ రీమేక్ హక్కుల కోసం అప్పుడే ఆ హిందీ హీరో
రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో రూపొందిన ఆరెంజ్ చిత్రం విడుదల కాకముందే క్రేజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం హిందీ నటుడు షాహిద్ కపూర్..తండ్రి పంకజ్ కపూర్..గీతా ఆర్ట్స్ వారిని సంప్రదించినట్లు తాజా సమాచారం. ఈ మేరకు వారు గజనీ హిందిలో నిర్మించిన మధు మంతెనని సంప్రదిస్తే అల్లు అరవింద్ ని కలిపారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఈ నెల 19 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో నాగబాబు నిర్మిస్తున్నఈ చిత్రం 'ఆరంజ్" టాగ్ లైన్ 'ఓ రేంజ్ లవ్ స్టోరి" కాస్తా 'లవ్ ఇన్ ఫాల్" గా మారింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా షాజన్ పదమ్ సీ నటిస్తోంది.
రామ్ చరణ్ తేజ్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ నాగబాబు ఆరంజ్ ram charan teja genelia bommarillu bhaskar nagababu orange


Click it and Unblock the Notifications