twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' ఆ మళయాళ చిత్రం కాపీ?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం Udayapuram Sulthan (1999)సినిమాకు కాపీ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దిలీప్, గోపీక జంటగా వచ్చిన ఈ చిత్రాన్ని జోశ్ ధామస్ డైరక్ట్ర్ చేసారు. అక్కడ ఈ కామెడీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఓ ముస్లిం సింగర్ బ్రాహ్మణుడు(నంబుద్రి)గా గెటప్ మార్చుకుని ఓ పెద్ద కుటుంబంలోకి వచ్చి వారి మనమరాలితో ప్రేమలో పడి, వారిని ఇంప్రెస్ చేయటమే కధాంశం. సినిమా చివరలో ఆ కుర్రాడు ఎవరో కాదు.. కులాంతర వివాహం చేసుకుని బయిటకు వెళ్లిపోయిన ఆ ఇంటి వారి కుమార్తె బిడ్డ అని తేలుతుంది. తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ రెండు కుటుంబాలను కలపటానికి ఆ కుర్రాడు ఆ నాటకమాడతాడు. ఇక ఈ చిత్రమూ, దేనికైనా రెడీ ఒకటా,కాదా అనేది తెలియాలంటే రిలీజ్ దాకా ఆగాల్సిందే.

    ఇక ఈ చిత్రం కథ గురించి దర్శకుడు చెపుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేసే కుర్రాడతను. ఓ అందాల భామను చూసి ప్రేమలోపడ్డాడు. ఆమె ఇంట్లోవాళ్లు సంప్రదాయాలూ... పద్ధతులూ అంటూ సవాలక్ష నిబంధనలు విధిస్తూ ఉంటారు. వాళ్లందరినీ ఒప్పించి ప్రేమను గెలిపించుకొనేందుకు అతగాడు దేనికైనా సిద్ధపడతాడు. మరి ఫలితం ఏ రీతిన వచ్చిందో తెర మీదే చూడమంటున్నారు.

    ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ' కోన వెంకట్, బీవీఎస్ రవి, గోపీమోహన్ కలిసి నేను హీరోగా ఓ కథ తయారు చేస్తున్నప్పుడు విష్ణుకి కథ కావాలని చెప్పా. అప్పుడు తాను డైరెక్ట్ చేద్దామని పెట్టుకున్న ఓ మలయాళ సినిమా సీడీని రవి ఇచ్చాడు. అద్భుతమైన కథ. ఆ కథ తీసుకుని కోన, గోపీ కలిసి విష్ణుకి తగ్గట్లు స్క్రిప్ట్ రాసిచ్చారు. కామెడీ ఇంత బాగా తియ్యవచ్చా అనేటట్లు నాగేశ్వరరెడ్డి ఈ సినిమాని తీశాడు. మా బేనరులో సిల్వర్, గోల్డెన్ జూబ్లీలు ఇచ్చిన దర్శకుల లిస్ట్‌లోకి అతను చేరతాడనే నమ్మకం ఉంది అన్నారు.

    విష్ణు మాట్లాడుతూ... 'మా సినిమా చాలా చాలా డిఫరెంట్, 100% సూపర్ డూపర్ హిట్టవుతుంది, రికార్డులు బద్దలు కొడుతుంది.. అని ఫాల్స్ కబుర్లు ఎప్పుడూ చెప్పను. సూపర్ డూపర్ హిట్లిచ్చిన వాళ్లకి డిజాస్టర్లు తప్పలేదు. ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్లకి హిట్లు రాకుండా ఆగలేదు. ప్రతి సినిమానీ బ్రహ్మండంగా చెయ్యాలని అనుకుంటాం. తనకోసం అట్టిపెట్టుకున్న కథను నా కోసం ఇచ్చిన బీవీఎస్ రవికి రుణపడి ఉంటాను. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాని బాగా తీశాడు. 'ఢీ' తర్వాత నేను అంత బాగా ఎంజాయ్ చేసింది ఈ సినిమాకే' అని చెప్పారు.

    ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వంశీకృష్ణ, సమర్పణ: శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్, నిర్మాణం: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు.

    English summary
    The latest buzz from Film Nagar ..Vishnu Manchu's 'Denikaina Ready' film a copy of Malayam comedy film Udayapuram Sulthan. Produced by Mohan Babu under his banner 24 Frames Factory, the movie is about to finish all post-production formalities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X