రాణా తదుపరి చిత్రం ఆ ప్లాఫ్ డైరక్టర్ తో కన్ఫర్మ్!?
లీడర్ చిత్రంతో తెరంగ్రేటం చేసిన రాణా ప్రస్తుతం పూరి జగన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తర్వాత దేవకట్టా దర్శకత్వంలో చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు దేవకట్టా చెప్పిన స్టోరీ లైన్ ని రాణా ఓకే చేసారని తెలుస్తోంది. దేవకట్టా రూపొందించిన ప్రస్దానం చూసిన రాణా ధ్రిల్లయి..ఈ చిత్రం అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్దానం చిత్రం మీడియా,మేధావులు అందరూ ఏకబిగిన మెచ్చుకున్నా ప్రేక్షకాదారణ మాత్రం నోచుకోలేదు. అయితే సీరియస్ గా కథనం నడపటం, షాట్ డివిజన్ చూసి రాణా ముచ్చటపడే ఈ అవకాశం ఇచ్చారని చెప్తున్నారు. ఇక పూరీ జగన్నాధ్ చిత్రానికి ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ జరుగుతోంది. సుబ్బరాజు, అలీ, ప్రదీప్ రావత్, ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందే పూరీ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. నల్లమలుపు బుజ్జి..ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గోలీమార్ వంటి భారీ ప్లాప్ తర్వాత పూరీ చేస్తున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











