twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవకట్టా..ఈ లెక్కలు మాకెందుకు?

    By Srikanya
    |

    హైదరాబాద్: మొన్నటి శుక్రవారం ఎప్పటినుంచో ఊరిస్తున్న 'ఆటోనగర్ సూర్య' విడుదలైంది. దేవా కట్టాకు ఓ వర్గంలో ఉన్న క్రేజు,మాస్ లుక్ తో ఓపినింగ్స్ బాగానే వచ్చాయి. అయితే అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అరకొర మార్కులు వేయించుకొంది. దానికితోడు సినిమాను ట్రిమ్ చేయడంతో కొంత నెగెటివ్ మార్కులే పడ్డాయి. ఫైనల్ గా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు దేవకట్టా మాత్రం ట్విట్టర్ లో ఓ చిత్రానికి ఓ రేంజిలో ప్రమోషన్ చేస్తూ హిట్ సినిమా అనిపించాలని తాపత్రయపడుతున్నారు. సినిమాకు యాక్చువల్ గా పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువే డబ్బులు వస్తాయని ఆయన చెప్తున్నారు.

    దేవకట్టా ట్వీట్ చేస్తూ.... నా లెక్క ప్రకారం ఆటోనగర్ సూర్య చిత్రంపై పది నుంచి పదకొండు కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు. మిగతాది అంతా ఆ సంస్ధ నుంచి వచ్చిన వేరే వాటి బర్డన్స్. మీరు మొదట ఆరు వారాల చిత్రం షేర్ ,శాటిలైట్, డబ్బింగ్ కలిపితే...20-30% వరకూ పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ వచ్చింది..ఇది నిజం అంటున్నారు.

    Deva Katta tweet about ANS Budget

    ఇలా బడ్జెట్, వచ్చిన లాభాలు ఆయన ట్విట్టర్ లో రాస్తుంటే చదివిన వారు...అయ్యిండవచ్చు...అయితే నిజం తెలుసుకుని ఏం చేయాలి...అంటున్నారు. అయితే ఆయన టార్గెట్ ఇండస్ట్రీలో వ్యక్తులు కోసం అని, మరో చిత్రం నిర్మాత కోసమని మరికొందరు అంటున్నారు. చిత్రం డిజాస్టర్ అయ్యిందని, నిర్మాతలు నష్టపోయారని చెప్పుకుంటూంటే ఇలా ట్వీట్స్ ద్వారా ఆయన ఖండిస్తున్నారని చెప్తున్నారు.

    English summary
    Deva katta tweeted: " As per my sources the actual spending on ANS is btwn 10-11 cr. The rest of the burdens were from other products and previous outings!If v look into d first 6 days share + satellite + dubbings, d product made 20-30% more than what's actually spent on it. This is truth !!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X