ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్.. దేవర 2 ఉన్నట్లా? లేనట్లా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR) కెరీర్‌లో 'ఆర్ఆర్ఆర్' (RRR) ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తారక్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపే కాకుండా భారీ ఫ్యాన్‌బేస్‌ను కూడా తెచ్చిపెట్టింది. అనంతరం ఆయన తన తదుపరి ప్రాజెక్టులను చాలా పక్కా ప్లానింగ్‌తో లైన్‌లో ఉంచారు. అందులో భాగంగా వచ్చిన దేవర పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. సోలో హీరోగా తారక్ స్టామినా ఏంటో చూపిస్తూ రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే థియేటర్లలో భారీ విజయాన్ని సాధించినా, ఓఓటీలో మాత్రం ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం ఒక కీలక టర్నింగ్ పాయింట్‌గా మారింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోని ప్రేక్షకుల కథలలో కొన్ని లోపాలను ఎత్తిచూపడంతో దర్శకుడు కొరటాల శివ అలర్ట్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో 'దేవర 2' స్క్రిప్ట్‌ను మరింత పదును పెట్టే పనిలో పడినట్లు సమాచారం. కానీ, ఇదే సమయంలో ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, ప్రస్తుతం తారక్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ సమాచారం. ఇది రెండు పార్టులుగా రావచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.

Devara 2 Delay Buzz Jr NTR Busy with Dragon Koratala Siva Shifts Focus

ఇక తారక్ డేట్స్ పూర్తిగా ఉండటంతో కొరటాల శివ తన దృష్టిని మరో ప్రాజెక్ట్‌పై పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఆయన నందమూరి బాలకృష్ణతో ఒక కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూలై నుంచి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 'దేవర 2' ప్రాజెక్ట్ టైమ్‌లైన్ మరింత వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అనుమానాలకు బలం చేకూర్చిన మరో అంశం ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా జరిగిన పరిణామాలు. సాధారణంగా స్టార్ హీరోల పుట్టినరోజులకు సంబంధించిన పోస్టర్లు, అప్‌డేట్స్ రిలీజ్ చేయడం ఇండస్ట్రీలో కామన్. కానీ 'దేవర' టీమ్ నుంచి ఎలాంటి ప్రత్యేక అప్‌డేట్ రాకపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. గతంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజుకి కూడా ప్రత్యేక పోస్ట్ పెట్టిన టీమ్, తారక్ బర్త్ డేను పూర్తిగా పట్టించుకోకపోవడం వెనుక చర్చ కారణాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. నిర్మాణ సంస్థ నుంచి పోస్టర్‌లో కూడా 'దేవర 2' ప్రస్తావన లేకపోవడం. దీనితో ఫ్యాన్స్‌లో మరింత సందేహాలు పెరిగాయి. సోషల్ మీడియాలో 'దేవర 2' ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లో ఉందా? లేక పూర్తిగా డ్రాప్ అయిందా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొంతమంది అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఇప్పట్లో ఆశించడం కష్టం అని భావిస్తున్నారు. మరోవైపు తారక్ ఫ్యూచర్ లైనప్ కూడా ఈ అనుమానాలకు బలం ఇస్తోంది. 'డ్రాగన్' తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో 'గాడ్ ఆఫ్ వార్' అనే ప్రాజెక్ట్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ 'దేవర 2' ప్రాజెక్ట్‌కు సమయం కేటాయించడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పరిణామాలను చూస్తే.. 'దేవర 2' ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం స్పష్టత లేకపోయినా, పూర్తిగా డ్రాప్ అయ్యిందని చెప్పడం కూడా పొరపాటే అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సీక్వెల్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం మాత్రం తక్కువగా ఉన్నాయి. అన్ని షెడ్యూల్స్ క్లియర్ అయ్యి, తారక్ - కొరటాల మళ్లీ కలిసే పరిస్థితి వస్తే ఈ సినిమా 2027 లేదా 2028లోనే పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతవరకు అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఎదురుచూడాల్సిందే.

Read more about: devara 2 jr ntr koratala siva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X