సమంత దారిలో జాన్వీ కపూర్.. అల్లు అర్జున్‌తో కలిసి అలా!

శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ జాన్వీ కపూర్ చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమాల ఆఫర్లను పక్కన పెట్టి హిందీలోనే సినిమాలు చేశారు. కానీ తాజాగా ఆమె టాప్ హీరోల సరసన భారీ ఆఫర్లు వేస్తూ తెలుగు సినిమాపై కన్నేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రంలోను అలాగే రాంచరణ్, బుచ్చిబాబు సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. తాజాగా అల్లు అర్జుణ్ మూవీలో కూడా నటిస్తున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక మంచి సక్సెస్ రాలేదు. దీంతో తన తల్లిని స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీ వైపు జాన్వీ చూపు తిప్పారు. తన తల్లి లాగానే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని.. ముందుగా తెలుగు సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.

Devara Actress Janhvi Kapoor to Special Song in Allu Arjun Pushpa 2 like Samantha Ruth Prabhu

ఈక్రమంలోనే ఇప్పటికే ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకొని నటిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ RC16 లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతున్నాయి. ఇక తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కూడా అవకాశం కొట్టేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2లో జాన్వీ కపూర్ కనిపించబోతుందట.

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 1లో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ సాంగ్ ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాటలో అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కర్ని విజుల్స్ వేయించాయి. ఇక ఆ సాంగ్ అంత పెద్ద హిట్టు అవ్వడంతో.. సెకండ్ పార్టులోని ఐటెం సాంగ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Devara Actress Janhvi Kapoor to Special Song in Allu Arjun Pushpa 2 like Samantha Ruth Prabhu

పుష్ప 2 మూవీ లోదేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు..? ఆ పాటలో ఏ భామ కనిపించబోతుంది..? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే తాజాగా పుప్ప మూవీలో మాదిరిగానే పుష్ప 2లో మరో స్పెషల్ సాంగ్ సిద్దం చేసినట్టు తెలుస్తున్నది. ఆ పాటలో యంగ్ హీరోయిన్‌ చూపించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Devara Actress Janhvi Kapoor to Special Song in Allu Arjun Pushpa 2 like Samantha Ruth Prabhu

గత కొన్నిరోజులుగా ఈ సెకండ్ పార్టులోని ఐటెం సాంగ్ లో దిశా పటానీ కనిపించబోతుందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ ఐటెం సాంగ్ లో జాన్వీ కపూర్, అల్లు అర్జున్ తో కలిసి చిందేయనుందని టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, అల్లు అర్జున్ అభిమానులు.. ఈ కాంబినేషన్ లో ఐటెం సాంగ్ బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. మరి ఫైనల్ గా పుష్ప ఏ భామతో చిందేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X