జాన్వీపై క్రేజీ రూమర్.. ఆ దర్శకునితో కావాలనే సాహసం చేస్తుందా?

ఎప్పటి నుంచో నార్త్ సినిమా నుంచి తెలుగు మరియు సౌత్ సినిమా దగ్గర పాగా వేసిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలా ఒకో జెనరేషన్ లో ఒకో హాట్ బ్యూటీ తెలుగు సినిమాలో మంచి ఫేమ్ అందుకున్నారు.

కాగా ప్రస్తుతం టాలీవుడ్ సహా సౌత్ లో వచ్చిన మొదటి సినిమా తోనే కల్లోలం రేపిన బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్ గా హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అనే చెప్పవచ్చు. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో చేసిన భారీ సినిమా దేవర తో తెలుగులో సెన్సేషనల్ డెబ్యూ తను ఇచ్చింది. ఇక ఈ తర్వాత మరిన్ని ఆఫర్స్ తెలుగులో అందుకుంది కానీ ఇపుడు ఓ క్రేజీ గాసిప్ జాన్వీ లైనప్ పై వినిపిస్తుంది.

Devara Heroine Janhvi Kapoor to tie hands with controversial director Pa Ranjith

కాగా జాన్వీ కపూర్ ఇపుడు తన కెరీర్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. కాగా తాజా గాసిప్స్ ప్రకారం ఈ హాట్ బ్యూటీ తమిళ కాంట్రావర్సియల్ దర్శకుడు పా రంజిత్ తో చేతులు కలపనున్నట్టు తెలుస్తోంది. కబాలి, కాలా ఇటీవల తంగలాన్ వంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇటీవల బ్యాడ్ గర్ల్ సినిమా విషయంలో ఒక కాంట్రవర్సీలో కూడా హైలైట్ అయ్యాడు.

అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఓ ఓటీటీ ప్రాజెక్ట్ కోసం ఇన్ని రోజులు మంచి బోల్డ్ ట్రీట్ ఇచ్చిన జాన్వీ, ఆమె చేసే హాట్ షోస్ కి పూర్తి భిన్నంగా సినిమాలు చేసే పా రంజిత్ తో చేతులు కలపడం అనేది ఒక ఊహించని కలయికగా మారింది అని చెప్పాలి. మరి ఇది వరకు మరో హాట్ బ్యూటీ మాళవిక మొహనన్ నుంచి ఊహించని పెర్ఫామెన్స్ ని పా రంజిత్ చూపించాడు.

Devara Heroine Janhvi Kapoor to tie hands with controversial director Pa Ranjith

మరి జాన్వీ కపూర్ పై ఎప్పటి నుంచో ఒక్క గ్లామర్ షో కోసం తప్పితే నటిగా ప్రూవ్ చేసుకుంది అనే మాట లేదు. అందుకే దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుందో ఏమో కాని ప్రస్తుతం ఈ క్రేజీ కలయిక పట్ల హాట్ గాసిప్స్ కొనసాగుతున్నాయి. అన్నట్టు వీరు వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం కలిసి పని చేస్తారని తెలుస్తోంది. అందులో ఓ భారీ వెబ్ సిరీస్ ని చేయనున్నారట.

సో ఇదే జాన్వీ కపూర్ కి తమిళ డెబ్యూ కూడా అని చెప్పవచ్చు. మరి చూడాలి జాన్వీ కపూర్ తమిళ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది. ఇక ఈ ప్రాజెక్ట్ పక్కన పెడితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ప్రస్తుతం ఆమె నటిస్తుండగా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా చేస్తుండగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తుండగా ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.

More from Filmibeat

Read more about: janhvi kapoor devara ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X