రామ్ చరణ్ ఆగిపోయిన సినిమా గుర్తుందా? ఆ టైటిల్‌తో నందమూరి హీరో మూవీ!

టాలీవుడ్ సినిమాలో కొన్ని సంఘటనలే ఉంటాయి. కొన్ని చిత్రాలు కొందరు హీరోస్ తో అనుకుని స్టార్ట్ అయ్యి ఆగిపోయినవి చాలా ఉన్నాయి, అలాగే చాలా వరకు షూటింగ్ అయ్యి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. అయితే ఈ తరహా చిత్రాల్లో వరుసగా మెగా హీరోస్ సినిమాలు ఉంటాయని చెప్పాలి. కాగా ఈ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎక్కువ సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయినవి ఉన్నాయి.

అలాగే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఉన్నాయి. తన నుంచి కూడా రెండు మూడు సినిమాలు అనుకుని మొదలయ్యి ఆగిపోయాయి. వాటిలో సత్యాగ్రహి సినిమా బాగా తెలిసి ఉండొచ్చు. దీని తర్వాత ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారితో కూడా ఓ సినిమా ఉంది. ఇవీ ఆగిపోయాయి.

devara producer hero coming with ram charan shelved title

ఇక వీరి తర్వాత వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లిస్ట్ లోకి వచ్చాడు. తన కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్స్ అందుకున్నాడు. మెయిన్ గా "మగధీర" సంచలనం తర్వాత "ఆరెంజ్" భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో మంచి హిట్ కొట్టాలని తమిళ దర్శకుడు ధరణితో మళ్ళీ అదే మగధీర కాంబినేషన్ కాజల్ హీరోయిన్ గా అనౌన్స్ చేసిన చిత్రమే "మెరుపు".

మరి అప్పట్లో 2011 లో అలా అనౌన్స్ చేసిన ఈ చిత్రం అప్పుడు మాస్ యుఫొరియాకి మాస్ ఆడియెన్స్ లోకి ఈ సినిమా బాగా వెళ్ళిపోయింది కానీ అనివార్య కారాణాలు రీత్యా ఈ సినిమా నిలిచిపోయింది. కాగా ఇప్పుడు ఈ ఆగిపోయిన సినిమా టైటిల్ ని నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాగా తీసుకున్నట్టుగా వినిపిస్తుంది.

devara producer hero coming with ram charan shelved title

ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా బయటకి రావాల్సి ఉంది. కాగా ఇప్పుడు కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి చేస్తుండగా ఈ చిత్రంలో వెర్సటైల్ నటి విజయశాంతి నటించారు. తనపై రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కి సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇంకా కళ్యాణ్ రామ్ ఇప్పుడు భారీ చిత్రం తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "దేవర" నిర్మాతగా చేస్తుండగా తాను నిర్మాతగా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు చిత్రాలు చేస్తున్నాడు.

ఇక మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గురు శిష్యు దర్శకులు బుచ్చి బాబు సానా, సుకుమార్ లతో వరుసగా 16, 17 సినిమాలు చేయనున్నాడు. ఇవి కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు. మొదటగా బుచ్చిబాబు సినిమా ఈ ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా మేకోవర్ కి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేసి వచ్చే ఏడాది లోనే రిలీజ్ కి చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X