NTR30: ఎన్టీఆర్ సినిమా టైటిల్ లీక్.. పవన్‌కు బండ్ల గణేష్ పెట్టుకున్న పేరే!

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే అత్యుత్తమ నటనను కనబరిచి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు, టీనేజ్‌లోనే ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలతో సత్తా చాటాడు. దీంతో ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఎన్టీఆర్ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో సత్తా చాటుతున్నాడు.

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రారంభం కావడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. అలాగే, ఇటీవలే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించి క్లారిటీ ఇచ్చింది.

 Devara Title for Jr NTR and Koratala Siva Movie

'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గతంలో దీనికి 'రుద్ర' అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై మరో న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ టైటిల్‌ను గతంలో పవన్ కల్యాణ్ కోసం బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే.

ఇద్దరు స్టార్ల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X