మహేశ్ - రాజమౌళి మూవీలో ‘హనుమాన్’: వామ్మో ఆ హాలీవుడ్ హీరో రేంజ్ పాత్రలో!
టాలీవుడ్ సినిమా స్థాయి ఇప్పుడు ఏ రేంజ్‌లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన మన సినిమా.. 'RRR'తో అంతర్జాతీయంగా ఎదిగింది. దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళినే అని తెలిసిందే.
ఇప్పుడు ఆయన మరింత హై రేంజ్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో మరో స్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరతడు? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

మహేశ్ బాబుతో రాజమౌళి
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ప్రాజెక్టును చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇందులో ఎంతో మంది స్టార్లు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆ పనులు పూర్తి చేశారని
అద్భుతమైన కలయికలో రూపొందనున్న రాజమౌళి - మహేశ్ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను రెడీ చేసినట్లు తెలిసింది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ స్టోరీపై పని చేశారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే డైలాగ్ వెర్షన్‌ను కూడా పూర్తి చేశారు.

ఫారెస్ట్ అడ్వెంచర్ కథనే
పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనున్న మహేశ్.. రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇందులో మహేశ్ బాబు లుక్స్ కూడా టార్జాన్ రేంజ్‌లో ఉంటాయని సమాచారం.
అప్పటి నుంచే మొదలు
వాస్తవానికి మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా 2022 ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. అయితే, ఇప్పుడు మహేశ్, రాజమౌళి ఈ మూవీ ప్రీ వర్క్ చేస్తున్నారు. మొత్తంగా మహేశ్ పుట్టినరోజున పూజ జరిపించి.. ఆ వెంటనే రెగ్యూలర్ షూట్‌ను మొదలు పెడతారని అంటున్నారు.

భారీ మూవీలో హనుమాన్
ఇండియాలోనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబుతో పాటు చాలా మంది స్టార్ హీరోలు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నాగార్జున సహా ఎంతో మంది హీరోలు కీలక పాత్ర చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో 'ఆదిపురుష్' హనుమాన్ పాత్రధారి దేవదత్తా నాగే కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది.

హాలీవుడ్ యాక్టర్ రేంజ్
టాప్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి చేస్తున్న ఈ సినిమాలో దేవదత్తా నాగే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నాడట. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ యాక్షన్ హీరో డ్వేన్ జాన్సర్ (Dwayne Johnson) మాదిరి లుక్స్‌తో కనిపిస్తాడని తెలిసింది. ఇందుకోసం దేవదత్త మరింత తన బాడీని పెంచబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











