కోపంతో రగిలిపోతున్న దేవీ శ్రీ ప్రసాద్‌.. ఇద్దరి కోసం ఇరగ్గొట్టేస్తాడట.!

దేవీ శ్రీ ప్రసాద్‌.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సంచలనం. చిన్న వయసులోనే ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి రాక్‌స్టార్ బిరుదును సొంతం చేసుకున్నాడు. పాటలు కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అత్యంత క్వాలిటీగా ఇస్తుంటాడు. అందుకే దేవీకి టాలీవుడ్‌లో డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఫిల్మ్ మేకర్లు అతడిని తమ సినిమాల్లో పెట్టుకోడానికి పోటీ పడుతుంటారు.

అయితే, ఇప్పుడు అతడిలో క్వాలిటీ తగ్గిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతంతోటే చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ, ఇటీవల డీఎస్పీ అందించిన పాటలు ఏమాత్రం స్పందనను రాబట్టుకోలేకపోతున్నాయని పలువురు అనుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం అతడు చేసిన సినిమాకు రివ్యూలు ఇచ్చిన విమర్శకులు.. సినిమాకు సంగీతమే మైనస్ అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం.

Devi Sri Prasad fire on rumours

అంతేకాదు, దేవీ శ్రీ ప్రసాద్ అభిమానులు సైతం అతడి నుంచి ఎంతో కోరుకుంటున్నారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన సంగీత దర్శకుడిని కోరుకుంటున్నారు. దీంతో దేవీలో కూడా ఆలోచన మొదలైనట్లు ప్రస్తుతం ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనితో పాటు, అతడు తనపై వస్తున్న విమర్శలపై బాగా కోపంలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరింత పట్టుదలగా పని చేస్తున్నాడట.

దీంతో దేవీ శ్రీ ప్రసాద్ త్వరలో చేయబోతున్న సినిమాల్లో తన సత్తా చూపించాలని కసితో ఉన్నాడని టాక్. దీనికితోడు మహేశ్ కూడా తన కోసం మంచి ఆల్బమ్ ఇవ్వాలని కోరాడట. ఇందులో భాగంగానే మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' కోసం డీఎస్పీ అదరిపోయే ఆల్బమ్ రెడీ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో దేవీ మ్యూజిక్ పీక్స్‌లో ఉంటుందని అంటున్నారు. పాటలు మాత్రమే కాదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇరగ్గొట్టేస్తాడని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X