మై గాడ్..రంగస్థలం సినిమాకే షాక్ ఇచ్చిన దేవిశ్రీ..!

Recommended Video

Rangasthalam audio launch expectations are in high

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం మార్చ్ 30 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్ర షూటిం పనులు చివరి దశలు చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసి మార్చ్ ఆరంభం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ గురించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అది ఆషామాషీ వార్త కాదు.. రంగస్థలం చిత్ర యూనిట్ కే దేవిశ్రీ షాక్ ఇచ్చాడంటూ తెగ వైరల్ అయిపోతోంది.

త్వరలో ఆడియో వేడుక

త్వరలో ఆడియో వేడుక

వీలైనంత త్వరగా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు మరియు ప్రమోషన కార్యక్రమాలు మొదలుపెట్టే యోచనలో ఉన్న రంగస్థలం నిర్మాతలు త్వరలో ఆడియో వేడుకకు ప్లాన్ చేస్తున్నారట.

దేవిశ్రీ వైఖరితో కంగుతిన్న..

దేవిశ్రీ వైఖరితో కంగుతిన్న..

ఆడియో వేడుక కోసం దేవిశ్రీని సంప్రదించారట. ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తే చిత్రానికి మంచి ఊపొస్తుందని భావించారు. కానీ నిర్మాతల ప్రతిపాదనకు దేవిశ్రీ అంగీకరించలేదట. ఫ్రీగా అయితే చేయనని తనకు రూ 25 లక్షల పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కంగుతిన్నారు.

మెగా హీరో చిత్రానికి అలా చేశాడేంటి

మెగా హీరో చిత్రానికి అలా చేశాడేంటి

వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ కు మెగా కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే దేవిశ్రీ ప్రసాద్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక పవన్ కు కూడా సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడు. బన్నికైతే లెక్కలేదు. మెగా ఫ్యామిలీతో అంత మంచి రాంపో మెయింటైన్ చేసే దేవిశ్రీ రాంచరణ్ ఆడియో వేడుకకు పారితోషకం అడగడం ఏంటి అని మెగా ఫాన్స్ చర్చించుకుంటున్నారు.

కేవలం పుకారులేనా

కేవలం పుకారులేనా

దేవిశ్రీపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ మరికొందరు మెగా ఫాన్స్, సినీవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చిత్ర ఆడియో వేడుక త్వరలో నిర్వహించాలనుకోవడం వాస్తవమే అని కానీ దానికి సంబంధించిన ప్లానింగ్ ఫైనల్ కాలేదని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.

పుకార్లు సృష్టించి..

పుకార్లు సృష్టించి..

దేవిశ్రీ ఈ మధ్య కాలంలో విదేశాలలో సైతం లైవ్ ఫెర్ఫామెన్స్ చేస్తున్నారు. ఆ షోలకు దేవిశ్రీకి పారితోషకం రూపంలో బాగానే కాసులు కురుస్తున్నాయి. దీనిని ఆధారం చేసుకుని ఈ పుకార్లు సృష్టించి ఉంటారనే అభిప్రాయాలు లేకపోలేదు.

దేవిశ్రీ సంగీతం కీలకం

దేవిశ్రీ సంగీతం కీలకం

దేవిశ్రీ ప్రసాద్ మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన సంగీత దర్శకుడు. చిరు, పవన్ మరియు బన్నీ అందరికి సూపర్ హిట్స్ అందించాడు. చరణ్ - దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఎవడు చిత్రం కూడా హిట్ అయింది. ఇక రంగస్థలం చిత్రం 1985 నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఆ తరహా కథలకు సంగీతమే కీలకం. ఇక సుకుమార్ - దేవీశ్రీ కలయికలో వచ్చిన ఏ ఆల్బమ్ కూడా ఫెయిల్ అవలేదు. దీనితో రంగస్థలం చిత్ర ఆడియోపై భారీ అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X