Mr Bachchan: రవితేజ మూవీలో మరో రాక్ స్టార్.. సిద్దు అలా ఇతడేమో మరోలా!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వయంకృషితో అడుగు పెట్టి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకి వాళ్లకు ఆదర్శంగా నిలిచిన హీరోనే రవితేజ. హీరోగా మారిన తర్వాత బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అతడు మాస్ మహారాజా అనిపించుకున్నాడు. అలా కమర్షియల్ హీరోగా మారి వరుసగా మూవీలు చేస్తున్నాడు. దీంతో రవితేజ రేంజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

'ధమాకా' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తన 74వ ప్రాజెక్టును హరీష్ శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్ బచ్చన్' అనే పేరుతో రాబోతున్న ఈ చిత్రం హిందీలో హిట్ అయిన 'రైడ్' మూవీకి రీమేక్‌గా రూపొందింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీశారు.

Devi Sri Prasad Guest Role In Ravi Teja Starrer Mr Bachchan Movie

సుదీర్ఘ విరామం తర్వాత రవితేజ - హరీష్ శంకర్ కలయికలో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయింది. ఆ వెంటనే దర్శకుడు హరీష్ శంకర్ పలు షెడ్యూళ్లను సైతం విజయవంతంగా కంప్లీట్ చేశాడు. ఇటీవలే షూట్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఇలా ఇప్పుడు సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు.

టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందించిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ఆగస్టు 15వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో రకాల వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో పాటు టాలీవుడ్‌లోని ఓ సెన్సేషనల్ స్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

Devi Sri Prasad Guest Role In Ravi Teja Starrer Mr Bachchan Movie

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోన్న 'మిస్టర్ బచ్చన్' చిత్రంలో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా నటించినట్లు తెలిసింది. ఓ కీలకమైన సీక్వెన్స్‌లో అతడు ఎంట్రీ ఇచ్చి రవితేజ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. అయితే, అది పాటలోనా? సీన్‌లోనా అన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. మొత్తానికి 'మిస్టర్ బచ్చన్' ఎన్నో కానుకలు రెడీ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. మాస్ స్టార్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X