దేవిశ్రీ ప్రసాద్ ఐటం సాంగ్ హైలెట్

By Srikanya

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కీ, చార్మికి మధ్యన రిలేషన్ ఉందని చాలా కాలంగా వార్తలు, విజువల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని గమనించిన ప్రభుదేవా ఆ క్రేజ్ ని తన సినిమా కోసం వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. సమీరా రెడ్డి, విశాల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో ఈ పెయిర్ చేత ఓ ఐటం సాంగ్ చేయించాలని ఆశపడుతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ పాట చేయటానకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే చార్మినే ఇంకా ఏ విషయమూ తేల్చి చెప్పలేదని తెలుస్తోంది. అయితే దేవి కూడా చార్మిపై ప్రెజర్ తెచ్చి సాంగ్ కి ఒప్పించటానికి ట్రై చేస్తున్నట్లు చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అయితే ఈ చిత్రానికి విజయ్ ఆంధోని సంగీతం అందిస్తున్నాడు. ప్రభుదేవా నృత్య రీతులు సమకూర్చే ఈ చిత్రంలో డాన్స్ చేయటం తన అదృష్టంగా ఫీలవుతున్నానంటున్నాడు. అయితే చార్మితో చేయటం ఆనందమో, లేక నిజంగా ప్రభుదేవా మీద అబిమానమో తెలియటం లేదంటున్నారు. ఇక ప్రస్తుతం దేవిశ్రి ప్రసాద్ తాజాగా దడ చిత్రానికి సంగీతం అందించారు. నాగచైతన్య హీరోగా చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదల అవుతోంది. హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రం తర్వాత నాగచైతన్య చేస్తున్న ఈ చిత్రం ఆడియో కూడా ఆ రేంజిలో ఉంటుందని చెప్తున్నారు. ఇక చార్మి విషయానికి వస్తే ఆమెకు తెలుగులో ఆఫర్స్ అస్సలు లేవు. దొంగల ముఠా ప్లాపుకు ఆమెకు ఆఫర్స్ కరువయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X