Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్-దేవిశ్రీ ప్రసాద్ మధ్య విభేదాలు, కారణం ఇదే...
దేవిశ్రీ ప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య విబేధాలు ఉన్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
Recommended Video
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గతంలో నాలుగు సినిమాలకు కలిసి పని చేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయం సాధించాయి.
అయితే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసిన 'అ..ఆ' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ మారాడు. ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకున్నాడు.
త్రివిక్రమ్-దేవిశ్రీ మధ్య విబేధాలు?
ఒకప్పుడు కలిసి వరుస సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్....మధ్య ఏదో విషయంలో విబేధాలు వచ్చాయని, అందుకే త్రివిక్రమ్ తన సినిమాలకు వేరే సంగీత దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలో ఎన్టీఆర్‌తో తీయబోయే సినిమాకు పాటలు సమకూర్చే బాధ్యత కూడా అనిరుధ్‌కే అప్పగించారు త్రివిక్రమ్. దేవిశ్రీతో క్రియేటివ్ డిఫరెన్స్ వల్లే త్రివిక్రమ్ అతడిని దూరం పెట్టారని టాక్.
ఆ సంఘటనతో మరింత బలపడింది
ఇంతకాలం ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తకు పెద్దగా బలం లేదు. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇటీవల కమల్ హాసన్, త్రివిక్రమ్ ఓకే రోజు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది.
త్రివిక్రమ్‌ను విష్ చేయని దేవిశ్రీ
కమల్ హాసన్, త్రివిక్రమ్ ఒకే రోజు పుట్టినరోజు వేడుక జరుపుకోగా కమల్ హాసన్‌ను విష్ చేసిన దేవిశ్రీ...... త్రివిక్రమ్‌ను విష్ చేయలేదు. మరి ఆయన మరిచిపోయారో? కావాలనే విష్ చేయలేదో? తెలియదు కానీ..... ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది.
బిజీ బిజీ
త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇటు పవన్ మూవీ చేస్తూనే, అటు ఎన్టీఆర్ మూవీ మొదలు పెట్టి త్రివిక్రమ్ బిజీ అయిపోయారు. రంగస్థలం, భరత్ అను నేను, ఎంసీఏ, హ్యాపీ వెడ్డింగ్ చిత్రాలకు సంగీతం అందిస్తూ దేవిశ్రీ ప్రసాద్ బిజీగా గడుపుతున్నారు.