మహేష్ ‘దూకుడు’కి చాలా ఎక్స్ ట్రా చేసిన దేవిశ్రీ...
ప్రిన్స్ మహేష్ బాబు, సమంత జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దూకుడు". ఈ చిత్రానికి సంగీతం అందించాల్సిందిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఈ చిత్ర నిర్మాత అడిగాడట. 1కోటి 50లక్షలు ఇస్తే చేస్తానని దేవి చెప్పాడట. సినిమా బడ్జెట్ అంత పర్మిట్ చెయ్యదు..కొంచెం తగ్గించుకోవాల్సిందిగా ఆ నిర్మాత దేవిని కోరాడట. మహేష్ బాబును, సమంతను పారితోషికం తగ్గించుకోమనండి. వాళ్ళు తగ్గించుకుంటే నేను తగ్గించుకుంటాను అనే టైపులో మాట్లాడాడట. ఏకంగా మహేష్ కు, సమంతకు టెండర్ పెట్టిన దేవిశ్రీని పారితోషికం విషయంలో ఒప్పించడం కుదరదని భావించిన నిర్మాత తమన్ ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నాడని సమాచారమ్.
మహేష్ బాబు దూకుడు సమంత శ్రీను వైట్ల దేవిశ్రీ ప్రసాద్ తమన్ mahesh babu dookudu samantha devisri prasad thaman


Click it and Unblock the Notifications