రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ దెయ్యం సంగీతం చెయ్యనున్నాడా..?

By Nageswara Rao

మ్యూజిక్ దెయ్యం ఎవరు అనుకుంటున్నారా..? అతను ఎవరంటే తన ట్యూన్స్ తో దర్శకనిర్మాతల దగ్గర నుండి ప్రేక్షకుల వరుకు అందరికి పిచ్చేక్కించే 'డి.యస్.పి'. అదేనండి దేవి శ్రీ ప్రసాద్. అతనికి ఈ పేరు పెట్టింది దర్శకుడు సుకుమార్. 100% లవ్ ఆడియో వేడుకలో దేవి టాలెంట్ ను ఎలా అభివర్ణించలో తెలియక అతన్ని దెయ్యం తో పోల్చాడు. మీడియాను కూడా ఇక నుండి దేవిని 'మ్యూజిక్ డెవిల్' అని పిలవమన్నాడు. అది సంగతి...!

ఇంతకీ ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే.. ఇప్పుడు ఈ మ్యూజిక్ డెవిల్ 'డి.యస్.పి' తొలిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు అని సమాచారం. గతం లో 'మెరుపు' సినిమాకు దేవి నే సంగీత దర్శకుడు కానీ ఆ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమాకు దేవి స్వరాలను సమకురుస్తున్నాడని తెలుస్తుంది. మెగా సూపర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంఫై నిర్మితమవుతున్న ఈచిత్రం ఏప్రిల్ 25న ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో తమన్న రామ్ చరణ్ తో జోడి కడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X